రచ్చ చేస్తున్న బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు | - | Sakshi
Sakshi News home page

రచ్చ చేస్తున్న బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు

Published Mon, Jan 27 2025 7:07 AM | Last Updated on Mon, Jan 27 2025 7:24 AM

రచ్చ చేస్తున్న బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు

రచ్చ చేస్తున్న బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు

తాండూరు: బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు మతిబ్రమించి మాట్లాడుతున్నారని, సమావేశాలను రచ్చ చేస్తున్నారని తాండూరు మున్సిపల్‌ కాంగ్రెస్‌ కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆదివారం తాండూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కౌన్సిలర్లు రత్నమాల నర్సింహులు, నీరజాబాల్‌రెడ్డి, సైదసల్మాఫాతిమా, బాంబినా, ప్రభాకర్‌గౌడ్‌, ప్రవీణ్‌గౌడ్‌, బోయరవిరాజ్‌, వెంకన్నగౌడ్‌, భీంసింగ్‌రాథోడ్‌లతో పాటు పార్టీ పట్టణ అధ్యక్షుడు హబీబ్‌లాలలు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎమ్మెల్యేగా మనోహర్‌రెడ్డి గెలిచాక.. మున్సిపాలిటీలో ఎలాంటి గొడవలు లేకుండా పాలన సాఫీగా సాగుతోందన్నారు. ఏడాది కాలంలో ఎమ్మెల్యే సహకారంతో మున్సిపల్‌లో అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు. మరోవైపు కాంగ్రెస్‌ ప్రభుత్వంలో జిల్లా ఎమ్మెల్యేలు కీలక పదవుల్లో ఉండటంతో అభివృద్ధి, సంక్షేమంతో ముందుకు దూసుకుపోతుందన్నారు. మున్సిపల్‌ ఏర్పడిన నాటి నుంచి చైర్‌పర్సన్‌ స్వప్నపరిమళ్‌ను అప్పటి ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి, ఆర్డీఓ అశోక్‌కుమార్‌ ఇబ్బందులు పెట్టారని ఆరోపించారు. బీఆర్‌ఎస్‌లోని ఆ 5మంది కౌన్సిలర్లు.. కౌన్సిల్‌ సమావేశం సాఫీగా సాగకుండా రచ్చ చేసేందుకే ప్రయత్నించారని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్‌లో ఉన్న వారంతా గతంలో రోహిత్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి వెంట ఉండి, ఓటమికి కారణమయ్యారన్నారు. ఇలాంటి వారు తమ పార్టీలోకి రాకుండా ఉంటే పార్టీకి మేలు జరుగుతుందన్నారు. కార్యక్రమంలో నాయకులు జలాల్‌ పాల్గొన్నారు.

కాంగ్రెస్‌ కౌన్సిలర్ల మండిపాటు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement