స్పీకర్ చొరవతోనే అభివృద్ధి
అనంతగిరి: స్పీకర్ చొరవతోనే వికారాబాద్ మున్సిపాలిటీ అభివృద్ధికి నిధులు తెచ్చామని చైర్పర్సన్ చిగుళ్లపల్లి మంజుల అన్నారు. ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఐదేళ్ల పాలన కాలం.. ప్రజలు, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, ఉన్నతాధికారులు, నాయకులు, కార్యాలయం అధికారులు, సిబ్బంది, పారిశుద్ధ సిబ్బంది సహకారంతో ముగిసిందని చెప్పారు. సమష్టి కృషితో రూ.119.81 కోట్లతో అభివృద్ధి పనులు చేశానని పేర్కొన్నారు. ఇందులో రూ.60 కోట్లు టీయూఎఫ్ఐడీసీ నిధులతో, అమృత్ 2.0లో భాగంగా రూ.12 కోట్లతో ఇదివరకే ఆయా పనులకు శంకుస్థాపన చేశామని తెలిపారు. కరోనా కష్టకాలంలో ప్రజలకు సేవ చేయడం అదృష్టంగా భావిస్తున్నాని, ఆ క్షణాలు జీవితంలో మరువలేనవని పేర్కొన్నారు. బాధ్యతలు చేపట్టిన నాలుగేళ్లలో అనుకున్నంత అభివృద్ధి చేయలేకపోయినా, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఏడాది కాలంలో అనుకున్న నిధులు తెచ్చి అభివృద్ధిలో ముందడుగు వేశామని స్పష్టంచేశారు. స్వచ్ఛ సర్వేక్షన్లో మున్సిపాలిటీ రాష్ట్ర స్థాయిలో ఉత్తమంగా రాణించడంతో అవార్డులు వరించాయని గుర్తు చేశారు. ఈ ప్రాంత అభివృద్ధికి అన్ని విధాలా సహకరించిన ప్రజలకు ఽఆమె కృతజ్ఞతలు తెలిపారు.
మున్సిపల్ చైర్పర్సన్ మంజుల
Comments
Please login to add a commentAdd a comment