
అడుగుకో గుంత.. ప్రయాణం చింత
మోమిన్‌పేట: మండల వాసులు నగరానికి వెళ్లాలంటే శంకర్‌పల్లి మీదుగా సమీపం మార్గం ఉంటుంది. కానీ వీరు మాత్రం వయా సదాశివపేట, సంగారెడ్డి మీదాగా వెళ్లాల్సి వస్తోంది. శంకర్‌పల్లి మార్గమంతా గుంతలమయంగా మారడంతో చేసేది లేక దూరభారమైనా చుట్టూ తిరిగి వెళ్తున్నారు.
బీటీ రోడ్డు వేయాలి
మోమిన్‌పేట నుంచి మైతాబ్‌ఖాన్‌గూడ వరకు 19 కిలో మీటర్ల దూరం ఉంటుంది. కానీ ఈ మార్గంలో ప్రయాణించాలంటేనే జనం జంకుతున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. కనీసం గుంతలు పూడ్చేందుకు సైతం ప్రభుత్వం నిధులు మంజూరు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏన్కతల, దేవరంపల్లి, చక్రంపల్లి, చీమల్‌దరి, బాల్‌రెడ్డిగూడెం ప్రజలు తప్పక శంకర్‌పల్లి రోడ్డు మీదుగానే వెళ్తున్నారు. మిగిలిన మండలాల వారు వయా సదాశివ్‌పేట మీదుగానే ప్రయాణిస్తున్నారు. రియల్ వ్యాపారం మండలంలో రెండేళ్ల క్రితం జోరుగా సాగింది. ఒక ఎకరా రూ.4కోట్ల వరకు ధరలు పలికాయంటే పరిస్థితి ఇట్టే అర్థమవుతుంది. ప్రభుత్వం ప్రకటించిన హెచ్‌ఎండీలో నాలుగు పంచాయతీలు విలీనం కానున్నాయని.. అధికారులు త్వరితగతిన చర్యలు తీసుకుని బీటీ రోడ్డు అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్నారు.
శంకర్‌పల్లి మార్గానికి బదులుగా సంగారెడ్డి మీదుగా వెళ్తున్న ప్రయాణికులు