
రైతులకు పరిహారం చెక్కులు అందజేత
అనంతగిరి: దుద్యాల్ మండలం హకీంపేట్‌లో పారిశ్రామిక పార్క్ కోసం భూములు ఇచ్చేందుకు ముందుకు వచ్చిన రైతులకు శనివారం కలెక్టర్ ప్రతీక్‌జైన్ తన కార్యాలయంలో పరిహారం చెక్కులు అందజేశారు. గ్రామ సర్వే నంబర్ 252లో 31 మంది రైతులకు చెందిన 55.35 ఎకరాల భూమిని పారిశ్రామిక పార్క్ కోసం సేకరించారు. ఇందుకు సంబంధించిన చెక్కులను కలెక్టర్ రైతులకు అందజేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లింగ్యానాయక్, తాండూరు సబ్ కలెక్టర్ ఉమాశంకర్ తదితరులు పాల్గొన్నారు.
హక్కులపై
అవగాహన కల్పిస్తున్నాం
అదనపు కలెక్టర్ లింగ్యానాయక్
అనంతగిరి: వినియోగదారుల హక్కులపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు అదనపు కలెక్టర్ లింగ్యానాయక్ తెలిపారు. ప్రపంచ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా శనివారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వినియోగదారుల హక్కులు, స్థిరమైన జీవన విధానికి న్యాయమైన ప్రవర్తన అనే అంశంపై అధికారులు, వినియోగదారులకు పలు సూచనలు చేశారు. వస్తు కొనుగోలులో వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఒకవేళ మోసానికి గురైతే ఎక్కడ ఫిర్యాదు చేయాలో వివరించారు. అన్ని రకాల దుకాణాలను తూనికలు, కొలతల శాఖ అధికారులు తనికీ చేయాలని ఆదేశించారు. సమావేశంలో డీసీఎస్‌ఓ మోహన్‌బాబు. డీఎల్‌ఎంఓ రియాజ్, కలెక్టరేట్ ఏఓ ఫరీనాఖాతూన్ తదితరులు పాల్గొన్నారు.
జాగ్రత్తగా ఉండండి
అటవీ శాఖ రేంజ్ ఆఫీసర్ శ్రీదేవి సరస్వతి
తాండూరు రూరల్: మండలంలో ఎలుగుబంటి, చిరుతపులి పిల్ల సంచరిస్తున్నందున ప్రజ లు అప్రమత్తంగా ఉండాలని తాండూరు అటవీ శాఖ రేంజ్ అధికారి శ్రీదేవి సరస్వతి సూచించారు. శనివారం మండలంలోని బెల్కటూర్, మల్కాపూర్ గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మల్కాపూర్ శివారులో చిరుతపులి పిల్ల తిరుగుతున్నట్లు కార్మికుల నుంచి తమకు సమాచారం వచ్చిందన్నారు. అక్కడి సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యంతో మాట్లాడి క్వారీ సమీపంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కోరినట్లు తెలిపారు. అలాగే బెల్కటూర్ సమీపంలో ఎలుగుబంటి సంచరిస్తోందని తెలిపారు. అక్కడ కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని పాలిషింగ్ యూనిట్ నిర్వాహకులను కోరినట్లు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
నూతన కార్యవర్గం
ఏకగ్రీవ ఎన్నిక
తాండూరు: తాండూరు బ్రాహ్మణ అర్చక, పురోహిత సంఘం నూతన కార్యవర్గాన్ని శనివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సంఘం అధ్యక్షుడిగా పురందరాచార్ శుక్రవార్, కార్యదర్శిగా సుధీంద్రాచారి, సహ కార్యదర్శిగా నాగరాజ్, కోశాధికారిగా సుమన్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు సంఘం ప్రతినిధులు తెలిపారు. కార్యవర్గం కాలపరిమితి 2025 నుంచి 28 వరకు ఉంటుందని పేర్కొన్నారు.

రైతులకు పరిహారం చెక్కులు అందజేత

రైతులకు పరిహారం చెక్కులు అందజేత

రైతులకు పరిహారం చెక్కులు అందజేత
Comments
Please login to add a commentAdd a comment