
ఫిర్యాదుల కోసం కాల్ సెంటర్
మహిళల రక్షణ కోసం ప్రభుత్వం అనేక చట్టాలను అమల్లోకి తెచ్చింది. అయి నా హింస ఆగకపోవడం ఆందోళన కలిగిస్తోంది. గృహ హింసకు గురయ్యే వారి కోసం 181 కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. బాధితులు స్వయంగా ఫోన్ చేసి రక్షణ పొందొచ్చు. బాధితులకు రక్షణ కల్పించి, కౌన్సెలింగ్ ద్వారా కాపురాలను నిలబెట్టేందుకు సఖి కేంద్రాలను ఏర్పాటు చేసింది. వనస్థలిపురం, శంషాబాద్‌లో ఈ కేంద్రాలు ఉన్నాయి. వనస్థలిపురం సఖి కేంద్రంలో ఇప్పటివరకు 881కేసులు రాగా, 186 మినహా అన్నీ పరిష్కరించాం. శంషాబాద్ కేంద్రానికి 91కేసులు రాగా, 64 మినహా అన్ని కేసులు పరిష్కరించాం.
– సంధ్యారాణి, మహిళా, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ అధికారి
Comments
Please login to add a commentAdd a comment