
విద్యతో పాటు ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం
మొయినాబాద్‌రూరల్: విద్యార్థులు విద్యతో పాటు ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలని రాష్ట్ర ఆరోగ్య శాఖ ఎడ్యుకేషనల్ డైరెక్టర్ డాక్టర్ ఎ.నరేంద్రకుమార్ పేర్కొన్నారు. మున్సిపల్ పరిధిలోని ఎన్కెపల్లి సమీపంలో గల భాస్కర విద్యా సంస్థల్లో 25వ వార్షికోత్సవాన్ని శనివారం రాత్రి ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి నరేంద్రకుమార్‌తో పాటు తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో రూపేష్, ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల కమాండ్ ఇంటెలిజెన్స్ అధికారి మేజర్ కునాల్‌సింగ్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం నరేంద్రకుమార్ మాట్లాడుతూ.. విద్యార్థులకు పౌష్టికాహారం, సరిపడా నిద్ర, వ్యాయామం ఎంతో అవసరం అని అన్నారు. పట్టుదల, కృషి ఉంటే భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవచ్చని తెలిపారు. రూపేష్, మేజర్ కునాల్‌సింగ్ మాట్లాడుతూ.. విద్యార్థులకు క్రమశిక్షణ ఎంతో అవసరం అన్నారు. అనంతరం విద్యార్థులకు మెడల్స్ అందజేశారు. కళాశాల కార్యదర్శి కృష్ణారావు,బీఎంసీ డైరెక్టర్ దీపిక పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment