
చిన్నవాటికే మనస్పర్థలు
దంపతుల మధ్య స్వార్థం పెరిగింది. ఈగో.. చిన్నచిన్న అంశాలకే గొడవపడుతున్నారు. కుటుంబ జీవి తంపై కనీస అవగాహన ఉండడం లేదు. పెళ్లి తర్వా త భర్త తరపు తల్లిదండ్రులు, ఇతర బంధువులను భార్య దూరం చేస్తోంది. భార్య తరపు బంధువులను భర్త దూరం పెడుతున్నారు. అమ్మాయి సున్నితంగా ఉంటే అబ్బాయి తరపు బంధువులు డామినేట్ చేస్తున్నారు. అబ్బాయి మెతకగా కన్పిస్తే అమ్మాయి తరపు బంధువులు వేధిస్తున్నారు. తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు చెప్పినా వినడం లేదు. సఖి కేంద్రానికి వస్తున్న కేసుల్లో మెజార్టీ ఈ తరహాకు చెందినవే. నిజానికి వీరికి పెళ్లికి ముందే కౌన్సెల్సింగ్ ఇవ్వాల్సి ఉంది.
– వి.జోత్స్న సీడీపీఓ, సఖికేంద్రం, వనస్థలిపురం
●
Comments
Please login to add a commentAdd a comment