తాండూరు పట్టణంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలంటూ సీపీఎం నాయకులు సోమవారం మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు. పలు వార్డుల్లో తాగునీటి సమస్య, డ్రైనేజీ, విద్యుత్ వంటి సమస్యలు ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదని నేతలు ఆరోపించారు. వెంటనే స్పందించకుంటే ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. అనంతరం మున్సిపల్ కమిషనర్‌కు వినతిపత్రం ఇచ్చారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు శ్రీనివాస్, నాయకులు రాజు, సురేష్, నారాయణ పాల్గొన్నారు.
– తాండూరు టౌన్