విద్యార్థులు పోటీతత్వాన్ని అలవర్చుకోవాలి
పూడూరు: విద్యార్థులు చిన్నప్పటి నుంచే పోటీతత్వాన్ని అలవర్చుకోవాలని మండలంలోని మేడిపల్లికలాన్ ప్రాథమిక పాఠశాల హెచ్‌ఎం శ్రీకాంత్ అన్నారు. సోమవారం ఎఫ్‌ఎల్‌ఎన్ పురస్కారాల్లో భాగంగా జిల్లా విద్యాఽశాఖ ఆధ్వర్యంలో చన్గోముల్ కాంప్లెక్స్ పరిధిలోని తొమ్మిది పాఠశాలల విద్యార్థులకు స్థానిక పాఠశాలలో క్విజ్ నిర్వహించారు. అంగడిచిట్టంపల్లి పాఠశాల విద్యార్థులు మొదటి స్థానంలో నిలిచారు. అనంతరం క్విజ్ పోటీల్లో పాల్గొన్న విద్యార్థులకు ప్రేరణ పురస్కార సర్టిఫికెట్‌లను అందజేశారు. కార్యక్రమంలో మెంటర్‌లు నాగరాజు, నవీన్, రాకేష్, అభిల తదితరులు పాల్గొన్నారు.