శభాష్ శశివర్ధన్
● హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఫలితాల్లో సత్తాచాటిన దుద్యాల్ వాసి
దుద్యాల్: తెలంగాణ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఫలితాల్లో దుద్యాల్‌కు చెందిన మాసుల శశివర్ధన్ సత్తాచాటారు. దీంతో తల్లిదండ్రులు చిన్న సాయప్ప, పద్మమ్మ ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. పేద కుటుంబానికి చెందిన శశివర్ధన్ తల్లిదండ్రులతోపాటు కూలి పనులు చేసుకుంటూ చదివాడు. పలుసార్లు పోటీ పరీక్షలు రాసి ఉద్యోగం కోసం ఎదురు చూశాడు. 2012లో కాంట్రాక్ట్ పద్ధతిన సర్వశిక్షా అభియాన్‌లో సీఆర్‌పీగా ఎంపికయ్యాడు. పదకొండేళ్లపాటు దుద్యాల్‌లో సీఆర్‌పీగా సేవలందిచాడు. ఆ తర్వాత దౌల్తాబాద్ మండలం గోకపస్లబాద్ పాఠశాలలో రెండేళ్ల నుంచి విధులు నిర్వహిస్తున్నారు. సీఆర్‌పీగా పని చేస్తూనే పోటీ పరీక్షలకు సిద్ధమయ్యడు. గతంలో జరిగిన హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పరీక్షలు రాసి ఉద్యోగానికి ఎంపికయ్యాడు. మంగళవారం దుద్యాల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శశివర్ధన్‌ను గ్రామస్థులు, విద్యార్థులు, ఉపాధ్యాయులుఘనంగా సన్మానించారు.
Comments
Please login to add a commentAdd a comment