రోడ్ల పక్క.. ఖాళీ స్థలాల్లో..
పరిగి: పరిగి మున్సిపాలిటీలో ఎక్కడ చూసినా చెత్త పేరుకుపోయింది. కొన్ని కాలనీలకు చెత్త సేకరణ వాహనాలు వారంలో రెండు మూడు రోజులే వస్తుండటంతో అక్కడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో రోడ్లపక్క చెత్తను పారబోస్తున్నారు. దీంతో ఈగలు, దోమలు వృద్ధి చెందడంతోపాటు దుర్గంధం వెదజల్లుతోంది. పరిగి మున్సిపాలిటీలో 15 వార్డులు, 32,500 జనాభా ఉంది. నిత్యం 14 వాహనాలతో 12 మెట్రిక్ టన్నుల చెత్తను సేకరిస్తున్నారు. తడి పొడి చెత్తను వేర్వేరుగా వేయాలని మున్సిపల్ అధికారులు చెబుతున్నా ప్రజలు మాత్రం రెండూ కలిపే వేస్తున్నారు. పరిగి పట్టణంలో చెత్త నిల్వకు డంపింగ్ యార్డు లేకపోవడంతో ప్రైవేటు స్థలాల్లో వేస్తున్నారు. ఇటీవల మున్సిపాలిటీలో ఆరు గ్రామాలు విలీనమయ్యాయి. దీంతో చెత్త సేకరణకు అదనపు వాహనాలు కావాల్సి ఉంది. ప్రస్తుతం ఉన్న వాహనాల ద్వారా చెత్త సేకరణ కష్టంగా ఉంది. రెండో సారి వాహనం రావడం ఆలస్యం అవుతుండటంతో ప్రజలు రోడ్ల పక్క, ఖాళీ ప్రదేశాల్లో చెత్తను పారబోస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment