ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి
అనంతగిరి: అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్ల సమస్యలపై ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు మైపాల్ డిమాండ్ చేశారు. అంగన్‌వాడీల సమస్యల పరిష్కారం కోసం మంగళవారం కలెక్టరేట్ వద్ద వంటావార్పు కార్యక్రమం నిర్వహించి నిరసన తెలిపారు. అనంతరం అడిషనల్ కలెక్టర్ లింగ్యానాయక్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అంగన్‌వాడీ కేంద్రాలకు డబుల్ సిలిండర్‌తోపాటు ప్రతి నెలా గ్యాస్ బిల్లులు ఇవ్వాలన్నారు. శిథిలావస్థలో ఉన్న భవనాలను తొలగించి కొత్త నిర్మాణాలు చేపట్టాలని కోరారు. ఎండల తీవ్రత ఎక్కువగా ఉండే మే నెలలో పూర్తిగా సెలవులు ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో నాయకులు, అంగన్‌వాడీ టీచర్లు నర్సమ్మ, భారతి, మంజుల, బేబి, లక్ష్మి, విజయలక్ష్మి, నవనీత, వనజ, సంతోష, జయమ్మ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment