క్రీడలతో ఉజ్వల భవిష్యత్తు
షాబాద్: చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని శంషాబాద్ ఎస్‌ఎస్ స్కేటింగ్ అకాడమీ కోచ్ శంకర్‌నాయక్ అన్నారు. ఆదివారం నగరంలోని అండర్ 10 కాంపిటేషన్ ఎస్‌ఎస్ రోలర్ స్కెటింగ్ ఛాంపియన్ షిప్ పోటీల్లో షాబాద్ మండల కేంద్రానికి చెందిన విద్యార్థి లంబాడి నవీష్ ప్రథమ స్థానంలో నిలిచాడు. ఈ సందర్భంగా బాలుడి తల్లిదండ్రులు, కోచ్ నవీష్‌ను అభినందించారు. అనంతరం కోచ్ మాట్లాడుతూ.. కృషి, పట్టుదల ఉంటే సాధించలేనిదంటూ ఏమీ లేదన్నారు. విద్యార్థుల ప్రతిభను గుర్తించి ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. అందుకు సహకరిస్తున్న వారి పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment