సీఎంను కలిసిన పద్మశాలీసంఘం నాయకులు
ఆమనగల్లు: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ఆదివారం ఆమనగల్లు పట్టణానికి చెందిన పద్మశాలీసంఘం నాయకులు కలిశారు. హైదరాబాద్‌లోని సీఎం నివాసంలో ఆయనను ఆమనగల్లు భక్తమార్కండేయ దేవస్థాన కమిటీ అధ్యక్షుడు ఎంగలి బాలకృష్ణయ్య, పద్మశాలీసంఘం నాయకులు అప్పం శ్రీనివాస్, మసున మురళీధర్, యాదగిరి కలిసి సత్కరించారు. ఈ సందర్భంగా ఆమనగల్లు భక్త మార్కండేయస్వామి దేవాలయ ఆవరణలో కమ్యునిటీహాలు, వసతిగృహం నిర్మాణానికి రూ.2 కోట్లు మంజూరు చేయాలని సీఎంకు వినతిపత్రం అందించారు.
లేబర్ అడ్డాల వద్ద సౌకర్యాలు కల్పించాలి
ఏఐటీయూసీ రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి పానుగంటి పర్వతాలు
మొయినాబాద్: భవన నిర్మాణ కార్మికుల లేబర్ అడ్డాల వద్ద ప్రభుత్వం మౌలిక సదుపాయాలు కల్పించాలని ఏఐటీయూసీ రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి పానుగంటి పర్వతాలు డిమాండ్ చేశారు. మున్సిపల్ కేంద్రంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. లేబర్ అడ్డాల వద్ద మౌలిక సదుపాయాలు లేక కార్మికులు గంటల తరబడి రోడ్లపైనే పనికోసం ఎదురుచూస్తున్నారని అన్నారు. తాగునీరు, టాయిలెట్స్ లేక మహిళా కార్మికులు అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వలస కార్మికుల పరిస్థితి మరీ దారుణంగా ఉందని.. బడా నిర్మాణ సంస్థలు తక్కువ కూలీ ఇచ్చి 12–14 గంటలు పనిచేయించుకుంటున్నాయని ఆరోపించారు. ప్రమాదాలు జరిగి కార్మికులు చనిపోతే ఎలాంటి నష్ట పరిహారం ఇవ్వకుండా రాత్రికి రాత్రే సొంత ఊళ్లకు పంపిస్తున్నారని.. ఇలాంటి ఘటనలు జిల్లాలో చాలానే వెలుగుచూశాయన్నారు. ఇలాంటి సమస్యలన్నింటిపై భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర మహాసభల్లో చర్చించడం జరుగుతుందన్నారు. ఏప్రిల్ 21, 22తేదీల్లో శంషాబాద్‌లో రాష్ట్ర మహాసభలు జరుగుతాయని.. ఈ మహాసభలను విజయవంతం చేయాలన్నారు. ఏప్రిల్ 21న శంషాబాద్‌లో జరిగే ర్యాలీ, బహిరంగ సభకు భవన నిర్మాణ కార్మికులంతా పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు కె.రామస్వామి, వర్కింగ్ ప్రెసిడెంట్ శేఖర్‌రెడ్డి, కార్యదర్శి సత్యానారాయణ, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment