
బకాయిలు వసూలు చేయాలి
కొడంగల్ రూరల్: మున్సిపాలిటీకి రావాల్సిన పన్ను బకాయిలను పూర్తిగా వసూలు చేయాలని మున్సిపల్ కమిషనర్ బలరాంనాయక్ పేర్కొన్నారు. మార్చి మొదటి వారం నుంచి చివరి తేదీ వరకు పన్ను వసూలు చేయాలని టార్గెట్‌గా పనిచేస్తున్నారని ఆయన తెలిపారు. మున్సిపల్ కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బందితో ఆయా కాలనీలలో తిరుగుతూ పన్ను వసూలుకు కృషిచేస్తున్నారు. ప్రజలకు పన్నులు సకాలంలో చెల్లించి అభివృద్ధికి తోడ్పడాలని కమిషనర్ బలరాంనాయక్ అవగాహన కల్పిస్తున్నారు.
ఇప్పటివరకు 75శాతం పూర్తి
మున్సిపాలిటీ పరిధిలో ఇప్పటివరకు 75శాతం పన్ను వసూలు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. మార్చి నెలలో మిగిలిన 6రోజుల్లో రెండు రోజులు సెలవు దినాలు. మిగిలిన 4రోజుల్లో బకాయి వసూలుకు అధికారులు, సిబ్బంది తీవ్రంగా కృషిచేస్తున్నారు.
మున్సిపల్ కమిషనర్ బలరాంనాయక్
అభివృద్ధికి సహకరించాలి
మున్సిపల్ పరిధిలోని పట్టణంతో పాటు గ్రామాల్లో సిబ్బంది తిరుగుతూ పన్ను బకాయిలు వసూలు చేస్తూ, అభివృద్ధికి సహకరించాలని అవగాహన కల్పిస్తున్నారు. ఇప్పటివరకు 75శాతం పన్ను వసూలయ్యాయి. మిగిలిన బకాయి వసూలుకు కృషిచేస్తున్నాం.
– బలరాంనాయక్, మున్సిపల్ కమిషనర్