వారానికి 40 నిమిషాలు
ఏఐ ఆధారిత బోధనకు ఎంపికైన పాఠశాలలకు కంప్యూటర్లు, ప్రింటర్లు అందజేశారు. వారానికి 40 నిమిషాల చొప్పున బోధన చేస్తున్నారు. 20 నిమిషాల చొప్పున రెండు సెషన్స్ ఉంటాయి. మొదట తెలుగు, ఆ తర్వాత మ్యాథమెటిక్స్ బోధించాల్సి ఉంటుంది. అయితే కొన్ని పాఠశాలల్లో మ్యాథ్స్ ప్రోగ్రాం అందుబాటులోకి తీసుకరాకపోవడంతో ఉపా ధ్యాయులు ఇబ్బంది పడుతున్నారు. తెలుగు, ఇంగ్లిష్ అనర్గళంగా మాట్లాడేందుకు, గణితంపై పట్టు సాధించేందుకు ఏఐ ఎంతగానో దోహదపడుతుందని ఉపాధ్యాయులు అంటున్నారు. ఎంపిక చేసిన పాఠశాలల్లో ఏఐ బోధన సక్సెస్ అయితే మిగతా స్కూళ్లలో అమలు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment