సై జగనన్నా.. | - | Sakshi
Sakshi News home page

సై జగనన్నా..

Published Sun, Jan 28 2024 2:14 AM | Last Updated on Sun, Jan 28 2024 9:25 AM

- - Sakshi

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బలగం.. దండులా కదిలివచ్చింది. జననేతను చూడ్డానికి.. వీలైతే మాట్లాడ్డానికి.. అవకాశం దొరికితే కరచాలనం చేయడానికి యువకులు, యువతులు, మహిళలు పోటెత్తారు. ఉత్తరాంధ్ర దారులన్నీ ‘సిద్ధం’ సభ వైపు కదలగా.. బంగాళాఖాతం చెంత జన సునామీ చుట్టేసింది. లక్షల గొంతుకలు ఒక్కటై.. జగన్‌ కావాలి.. మళ్లీ జగనే రావాలి అంటూ నినదించడంతో సాగరఘోష చిన్నబోయింది. వందలాదిగా బస్సులు.. వేలాదిగా కార్లు, ఆటోలు.. ఇలా అనేక వాహనాలతో వచ్చిన ప్రజలతో సంగివలస ప్రాంతం జనసంద్రమైంది. విశాఖ చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో జరిగిన సభతో ఉత్తరాంధ్ర ఉప్పొంగగా.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మాటలు జనం గుండెలను తాకాయి. పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపాయి. రణరంగంలో మేము సైతం ‘సిద్ధం’ అంటూ పార్టీ శ్రేణులు సమరోత్సాహంతో అధినేతకు జై కొట్టారు. – సాక్షి, విశాఖపట్నం

భీమిలి నుంచి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికల శంఖారావం పూరించారు. నియోజకవర్గంలోని సంగివలస వద్ద శనివారం జరిగిన ‘సిద్ధం’ సభకు ఉత్తరాంధ్ర జిల్లాల్లోని 34 నియోజకవర్గాల నుంచి పార్టీ కేడర్‌ అంతా కదిలి వచ్చింది. గత సమావేశాల కంటే భిన్నమైన ‘సిద్ధం’ సభ లక్షలాది జనంతో కిక్కిరిసిపోయింది. గత టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన బూటకపు హామీలు, చేసిన దుర్మార్గాలను ఎండగడుతూ.. వైఎస్సార్‌ సీపీ పాలనలో జరిగిన సంక్షేమం, అభివృద్ధిపై జరిగిన సభలో సీఎం జగన్‌ చేసిన ప్రసంగానికి ప్రతి ఒక్కరూ ఫిదా అయిపోయారు. 56 నెలల పాలనలో అందించిన సంక్షేమాభివృద్ధిని ప్రతి ఇంటికీ వెళ్లి వివరించాలని.. దుష్టచతుష్టయంపై సోషల్‌ మీడియా వేదికగా పోరాడాలని ఇచ్చిన పిలుపు పార్టీ శ్రేణుల్లో సమరోత్సాహం నింపింది.

గ్రామాల చెంతకే ప్రభుత్వ పాలన, విద్య, వైద్యం తీసుకొచ్చామని.. మీ జగనన్న చెప్పినట్లుగా ప్రతి పేదోడి ఇంటికి వెళ్లి మనం చేసిన మంచిని వివరించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మరో 70 రోజుల్లో రానున్న ఎన్నికల కురుక్షేత్రంలో యుద్ధానికి సిద్ధం కావాలని ఆయన పార్టీ కేడర్‌ను సమాయత్తం చేశారు. బిగ్‌ ర్యాంప్‌పై నుంచి నడుచుకుంటూ ప్రజలకు అభివాదం చేశారు. జై జగన్‌.. మళ్లీ సీఎం వైఎస్‌ జగన్‌ అనే నినాదాలతో సభా ప్రాంగణం హోరెత్తిపోయింది. రానున్న సార్వత్రిక ఎన్నికల సమరానికి మేము సైతం సిద్ధం అంటూ కార్యకర్తలు, అభిమానులు, నాయకులు గట్టి మద్దతు తెలిపారు. 75 నిమిషాల పాటు సీఎం ప్రసంగించగా.. ఆయన మాట్లాడుతున్నంత సేపు ‘‘వుయ్‌ వాంట్‌ సీఎం.. వన్స్‌ మోర్‌ సీఎం’’.. ‘‘ఎన్నికల యుద్ధానికి సై..’’ అంటూ దిక్కులు పిక్కటిల్లేలా వైఎస్సార్‌ సీపీ శ్రేణులు, కార్యకర్తలు నినాదాలు చేశారు. లబ్ధి పొందిన ప్రతీ కుటుంబం నుంచి స్టార్‌ క్యాంపెయినర్లు రావాలని సీఎం పిలుపునివ్వగా.. మేము సిద్ధం అంటూ జెండాలు పైకెత్తి.. సై అన్నారు.

పాల్గొన్న ప్రముఖులు
బహిరంగ సభలో వైఎస్సార్‌ సీపీ రీజినల్‌ కో–ఆర్డినేటర్లు వైవీ సుబ్బారెడ్డి, బొత్స సత్యనారాయణ, స్పీకర్‌ తమ్మినేని సీతారాం, డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్రస్వామి, డిప్యూటీ సీఎంలు పీడిక రాజన్న దొర, బూడి ముత్యాలనాయుడు, మంత్రులు విడదల రజని, ధర్మాన ప్రసాదరావు, సీదిరి అప్పలరాజు, గుడివాడ అమర్‌నాథ్‌, పార్టీ జిల్లా అధ్యక్షులు కోలా గురువులు, ధర్మాన కృష్ణదాస్‌, మజ్జి శ్రీనివాసరావు, పరీక్షిత్‌రాజు, చెట్టి పాల్గుణ, బొడ్డేడ ప్రసాద్‌, ఎంపీలు ఎంవీవీ సత్యనారాయణ, భీశెట్టి వెంకట సత్యవతి, బెల్లాన చంద్రశేఖర్‌, విశాఖ పార్లమెంట్‌ ఇన్‌చార్జి బొత్స ఝాన్సీ, శ్రీకాకుళం పార్లమెంట్‌ ఇన్‌చార్జి పేరాడ తిలక్‌, జిల్లా పరిషత్‌ చైర్మన్లు జె.సుభద్ర, పిరియ విజయ, ఎమ్మెల్సీలు తలశిల రఘురాం, లేళ్ల అప్పిరెడ్డి, వరుదు కల్యాణి, దువ్వాడ శ్రీనివాస్‌, డాక్టర్‌ పి.సురేష్‌బాబు, రఘురాజ్‌, కుంభా రవిబాబు, ప్రభుత్వ విప్‌ కరణం ధర్మశ్రీ, ఎమ్మెల్యేలు ముత్తంశెట్టి శ్రీనివాసరావు, పెట్ల ఉమాశంకర్‌ గణేష్‌, అన్నంరెడ్డి అదీప్‌రాజ్‌, గొల్ల బాబూరావు, కె.భాగ్యలక్ష్మి, తిప్పల నాగిరెడ్డి, పాముల పుష్పశ్రీ వాణి, వాసుపల్లి గణేష్‌ కుమార్‌, యూవీ రమణమూర్తిరాజు, కంబాల జొగులు, కడిబండి శ్రీనివాసరావు, బడ్డుకొండ అప్పలనాయుడు, బొత్స అప్పలనర్సయ్య, కంబాల జోగులు, సమ్మంగి చిన అప్పలనాయుడు, అలజంగి జోగారావు, విశ్వసరాయి కళావతి, గొర్లె కిరణ్‌కుమార్‌, రెడ్డి శాంతి, సమన్వయకర్తలు కె.కె.రాజు, ఆడారి ఆనంద్‌ కుమార్‌, నియోజకవర్గ ఇన్‌చార్జిలు డాక్టర్‌ కలే రాజేష్‌, దువ్వాడ శ్రీనివాస్‌, మలసాల భరత్‌కుమార్‌, ఉరుకూటి రామచంద్రరావు, రాష్ట్ర, జిల్లా కార్పొరేషన్‌ చైర్మన్లు జాన్‌ వెస్లీ, శోభాస్వాతిరాణి, పిల్లా సుజాత, చొక్కాకుల వెంకటరావు, మాధవీవర్మ, కొండా రాజీవ్‌ గాంధీ, కె.వి.బాబా, ప్రభుత్వ సలహాదారుడు, వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర ప్రచార విభాగం అధ్యక్షుడు ధనుంజయ్‌రెడ్డి, ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన్‌ కార్యదర్శి గోపీనాథ్‌రెడ్డి, ఎంఎస్‌ఎంఈ ప్రభుత్వ సలహాదారుడు మిలీనియం శ్రీధర్‌ రెడ్డి, డిప్యూటీ మేయర్లు జియ్యాని శ్రీధర్‌, కె.సతీష్‌, మాజీ ఎమ్మెల్సీ సూర్యనారాయణరాజు, మాజీ ఎమ్మెల్యే మళ్ల విజయప్రసాద్‌, రాష్ట్ర వైఎస్సార్‌ సీపీ కార్యకర్తల కోఆర్డినేటర్‌ పుత్తా ప్రతాప్‌ రెడ్డి, నవరత్నాల వైస్‌ చైర్మన్‌ అంకంరెడ్డి నారాయణ మూర్తి, వెలమ కార్పొరేషన్‌ చైర్మన్‌ నెక్కల నాయుడుబాబు, నియోజకవర్గ పరిశీలకులు పసుపులేటి బాలరాజు, రొంగలి జగన్నాథం, చిక్కాల రామారావు, ఐహెచ్‌ ఫరూఖీ, చింతలపూడి వెంకట్రామయ్య, కాశీ విశ్వనాథం, శ్రీనివాసరెడ్డి, వీసం రామకృష్ణ, పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు దామ సుబ్బారావు, పీలా ఉమారాణి, రాష్ట్ర యువజన విభాగం ఉపాధ్యక్షుడు శ్రీవత్సవ్‌, రవిరెడ్డి, ముఖ్య నాయకులు, రాష్ట్ర, జిల్లా అనుబంధ సంఘాల అధ్యక్షులు, కార్పొరేటర్లు, కార్పొరేషన్‌ డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.

సభ జరిగిందిలా..
మధ్యాహ్నం 3 గంటల నుంచే పలువురు మంత్రులు, నేతలు కార్యకర్తలనుద్దేశించి ప్రసంగించారు. తొలుత పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కోలా గురువులు ప్రసంగించారు. అనంతరం డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర, ఎమ్మెల్యే గొల్ల బాబూరావు, మంత్రి ధర్మాన ప్రసాదరావు, భీమిలి ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విశాఖ విమానాశ్రయం నుంచి 3.55 గంటలకు సభా ప్రాంగణానికి చేరుకున్నారు.

తొలుత మహానేత వైఎస్సార్‌ విగ్రహానికి నివాళులర్పించారు. సాయంత్రం 4.10 గంటలకు ప్రసంగం ప్రారంభించారు. 5.25 గంటల వరకు వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో జరిగిన మేలును ప్రతి కుటుంబానికి వెళ్లి వివరించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అనంతరం ఎన్నికల శంఖారావం పూరించారు. అక్కడ నుంచి 10 నిమిషాల పాటు బహిరంగ సభలో ఏర్పాటు చేసిన ర్యాంప్‌పై నుంచి కార్యకర్తలకు అభివాదం చేసుకుంటూ నడిచారు. సభ పూర్తయిన తర్వాత తిరిగి సంగివలస వద్ద హెలిప్యాడ్‌ వద్దకు చేరుకున్నారు. అక్కడ నుంచి హెలికాప్టర్‌లో సాయంత్రం 5.55 గంటలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/6

సిద్ధం ప్లకార్డులతో నినాదాలు చేస్తున్న పార్టీ కార్యకర్తలు2
2/6

సిద్ధం ప్లకార్డులతో నినాదాలు చేస్తున్న పార్టీ కార్యకర్తలు

పెత్తందారుల కటౌట్‌లు3
3/6

పెత్తందారుల కటౌట్‌లు

సాంస్కృతిక ప్రదర్శనలతో ఉర్రూతలూగిస్తున్న వంగపండు ఉష బృందం4
4/6

సాంస్కృతిక ప్రదర్శనలతో ఉర్రూతలూగిస్తున్న వంగపండు ఉష బృందం

5
5/6

మేము సైతం సిద్ధం..6
6/6

మేము సైతం సిద్ధం..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement