
మోసపోయారా? మేం పోరాడతాం
● వినియోగదారుడికి అండగా ఉన్నాం ● ఏడేళ్ల కాలంలో విశాఖలో 86 కేసులు ఫైల్ చేశాం ● 90శాతం కేసుల్లో పరిహారం అందించగలిగాం ● వినియోగదారుల హక్కుల మండలి జాతీయ అధ్యక్షుడు డా.వికాస్‌పాండే
సాక్షి, విశాఖపట్నం: వస్తు సేవల్లో నాణ్యత కొరవడినా, నష్టపోయినా వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టం–1986 ప్రకారం బాధితుల తరఫున పోరాడేందుకు నిరంతరం శ్రమిస్తున్నామని వినియోగదారుల హక్కుల మండలి జాతీయ అధ్య క్షుడు డా.వికాస్ పాండే తెలిపారు. కన్జ్యూమర్ రైట్స్ డే సందర్భంగా నగరంలో పలు వ్యాపార సముదాయాలు, దుకాణాల్లో మండలి తరఫున అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ‘సాక్షి’తో పలు అంశాలపై మాట్లాడారు.
13 ఏళ్లుగా పోరాడుతున్నాం
వినియోగదారుడి సమస్య.. మండలి సమస్య గా భావించి 13 ఏళ్లుగా పోరాటం చేస్తున్నాం. చట్ట ప్రకారం ఏ ఒక్క వినియోగదారుడు మోసపోకూడదు. దేశ వ్యాప్తంగా 23 రాష్ట్రాల్లో మండలి తరఫున కేసులు వేస్తూ న్యాయం కోసం పోరాడు తున్నాం. ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పిస్తున్నాం. వినియోగదారుడు కోర్టుల చుట్టూ తిరగా ల్సిన అవసరం లేకుండా.. ఎలాంటి ఫీజులు తీసుకోకుండా కేసు గెలిచేంత వరకు అండగా ఉంటాం.
దేశ వ్యాప్తంగా 300 కేసుల ఫైలింగ్
మా మండలి తరఫున దేశ వ్యాప్తంగా గడిచిన ఐదేళ్లలో 300కిపైగా కేసులు వేశాం. విశాఖలో 86 కేసులు నమోదు చేశాం. ఈ ఏడాది ఇప్పటి వరకు విశాఖ జిల్లాలో 7 కేసులు ఫైల్ చేశాం. దాదాపు 90 శాతం కేసుల్లో విజయం సాధించాం. 6–7 నెలల్లో మిగిలిన కేసులు కూడా పరిష్కారం కానున్నాయి.
సైబర్ నేరాలపైనా పోరాటం..
ఇప్పుడు సైబర్ నేరాలు రాజ్యమేలుతున్నాయి. అందుకే వాటిపైనా దృష్టిసారించాం. బ్యాంకుల పేరు తో మోసాలు జరుగుతున్నాయి. ఈ మధ్య కాలంలో విశాఖలో ఎస్ సెక్యూరిటీస్ పేరుతో నకిలీ యాప్ ద్వారా హరికుమార్ అనే వ్యక్తి రూ.15 లక్ష లు నష్టపోయారు. కొటక్ సెక్యూరిటీస్ పేరుతో వెంకటరమణ అనే వ్యక్తి రూ.15 లక్షలు పోగొట్టుకున్నా రు. దీనిపైనా కేసులు ఫైల్ చేశాం. సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాం.
చట్టం ఎంతో ఉపయోగపడుతుంది
వినియోగదారుల హక్కుల చట్టం ఎంతో ఉపయోగపడుతుంది. ప్రజలు దీనిపై అవగాహన పెంచుకోవాలి. ఎవరికి ఏ మోసం జరిగినా మండలిని ఆశ్రయిస్తే.. పరిష్కారం చూపుతాం. చట్టం విలువ అందరికీ తెలియజెప్పేందుకు దేశ వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాం.