
మోసం జరిగితే ధైర్యంగా ఫిర్యాదు చెయ్యాలి
వినియోగదారుల్లో ప్రశ్నించేతత్వం పెరగాలి. అప్పుడే వ్యాపారుల్లో మోసపూరిత ధోరణులు మారతాయి. వస్తువు కొనుగోలు చేసే సమయంలో తూకాలను నిశితంగా గమనించాలి. మోసాలకు పాల్పడతున్నట్లు అనుమానం వస్తే వెంటనే తూనికలు, కొలతల శాఖ టోల్‌ఫ్రీ నంబర్ 1967, లేదా 0891–27995511 నంబర్‌కి ఫోన్‌చేసి ధైర్యంగా ఫిర్యాదు చెయ్యండి. ప్రజలు కూడా ఏదైనా వస్తువు కొనే ముందు కొలతలు సరిగా చేస్తున్నారా లేదా గమనించడం అలవాటు చేసుకోవాలి.
– కె.థామస్ రవికుమార్,
ఏపీ లీగల్ మెట్రాలజీ ఉమ్మడి జిల్లా డిప్యూటీ కంట్రోలర్