సీతమ్మధార: తమ సమస్యల పరిష్కారానికి ఈ నెల 24న జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేపడుతున్నట్టు క్యాబ్ డ్రైవర్స్ యూనియన్ (సీఐటీయూ) గౌరవ అధ్యక్షుడు బి.జగన్, అధ్యక్షుడు సిహెచ్.శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి కె.పోలినాయుడు తెలిపారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద మంగళవారం జరిగిన కార్యక్రమంలో ధర్నా పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఓలా, ఉబర్, ర్యాపిడో డ్రైవర్లకు రాడార్ ట్రిప్పులు, ప్రీపెయిడ్ ఆప్షన్ తీసివేయాలని డిమాండ్ చేశారు. క్యాబ్ డ్రైవర్లకు పీఎఫ్, ఈఎస్‌ఐతో కూడిన సామాజిక భద్రత చట్టం చేయాలన్నారు. డ్రైవర్లు, కస్టమర్లకు ఉపయోగపడేలా ఓలా, ఉబర్, ర్యాపిడో తరహాలో ప్రభుత్వం యాప్‌ను తీసుకురావాలని కోరారు. మోటార్ వెహికల్ చట్టం 2019, గ్రీన్ టాక్స్‌లను రద్దు చేయాలని, బీమా ప్రీమియం, టోల్‌గేట్ చార్జీ లు తగ్గించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో అధిక సంఖ్యలో క్యాబ్ డ్రైవర్లు పాల్గొన్నారు.