ఏయూ ఆచార్యులకు పేటెంట్ మంజూరు
విశాఖ విద్య: బయో యాక్టివ్ ఫీడ్ యాడిటివ్ ఫర్ కంట్రోలింగ్ విబ్రియో ఇన్ఫెక్షన్స్ ఇన్ క్రస్టేషియన్స్ అంశంపై ఏయూలోని మైరెన్ లివింగ్ రిసోర్సెస్ విభాగం ప్రొఫెసర్ పి.జానకి రామ్, డాక్టర్ సునీల్‌కుమార్‌లకు సంయుక్తంగా భారత ప్రభుత్వ పేటెంట్ మంజూరయింది. రొయ్యల పరిశ్రమలో వచ్చే వ్యాధులకు సంబంధించిన నూతన ఔషధాన్ని అభివృద్ధి చేసిన విధానానికి గాను వీరికి పేటెంట్ దక్కింది. ఈ సందర్భంగా ఏయూ వీసీ ఆచార్య జి.పి.రాజశేఖర్, రిజిస్ట్రార్ ఆచార్య ఇ.ధనంజయరావు, ప్రిన్సిపాల్ ఎంవీఆర్ రాజులు పేటెంట్ సాధించిన ఆచార్యులను అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment