పిచ్చుకలకు తోడుగా..
మద్దిలపాలెం: మన ఇంటికి వచ్చే పిచ్చుకలను మనమే కాపాడుకుందామని డాక్టర్ వి.ఎస్.కృష్ణా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ఐ.విజయబాబు పిలుపునిచ్చారు. ప్రపంచ పిచ్చుకల దినోత్సవం పురస్కరించుకుని బుధవారం గ్రీన్ క్లైమేట్ టీం ఆధ్వర్యంలో కళాశాల విద్యార్థులకు పిచ్చుకల గూళ్లు, మంచి నీటి పాత్రలు ఏర్పాటు చేసే విధానంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ వేసవిలో పక్షుల కోసం నీరు అందుబాటులో ఉంచాలని సూచించారు. ఇంటి ముందు బియ్యం పిండితో ముగ్గులు వేయాలని కోరారు. పర్యావరణాన్ని పరిరక్షించుకుంటేనే జీవకోటి మనుగడ సాధ్యమన్నారు. గ్రీన్ కై ్లమేట్ వ్యవస్థాపక కార్యదర్శి జె.వి.రత్నం మాట్లాడుతూ 25 ఏళ్లుగా పిచ్చుకలకు గూళ్లు, ఇతర పక్షులు, వన్య ప్రాణుల కోసం మట్టి పాత్రలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ పి.జయ, బోటనీ హెడ్ ఎస్.పద్మావతి, టీచింగ్ ఫ్యాకల్టీ ఎం.హెచ్.డి పద్మావతి, స్వామినాయుడు, గ్రీన్ వలంటీర్లు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment