సింహగిరిపై అభివృద్ధి పనుల పరిశీలన
సింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి దేవస్థానంలో రూ.54 కోట్లతో జరుగుతున్న ప్రసాద్ పథకం పనులను ఏప్రిల్ 10 నాటికి పూర్తి చేయాలని కలెక్టర్ హరేందిర ప్రసాద్ పర్యాటక శాఖ అధికారులను ఆదేశించారు. ఏప్రిల్ 30న సింహగిరిపై జరిగే చందనోత్సవానికి సంబంధించి చేయాల్సిన ఏర్పాట్లపై బుధవారం కలెక్టర్ ముందస్తు పరిశీలన చేశారు. దేవస్థానం ఈవో కె.సుబ్బారావు, ఇంజినీరింగ్ అధికారులు ఆయా ఏర్పాట్లను ఆయనకు వివరించారు. ఈ క్రమంలో సింహగిరిపై ఉన్న క్యూలు, నిత్యాన్నదాన ప్రసాద భవనం, ప్రసాదాల తయారీ విభాగాలను కలెక్టర్ పరిశీలించారు. అలాగే ప్రసాద్ పథకంలో భాగంగా జరుగుతున్న షాపింగ్ కాంప్లెక్స్, క్యూ కాంప్లెక్స్, టూరిస్ట్ ఇన్ఫర్మేషన్ సెంటర్, పార్కుల అభివృద్ధి, కల్యాణ మండపం, బస్టాండ్ ఆధునికీకరణ తదితర పనులను పరిశీలించారు. పనులను వేగవంతంగా చేసి రానున్న చందనోత్సవం నాటికి భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. దేవస్థానం ఈఈలు శ్రీనివాసరాజు, రాంబాబు, పర్యాటక శాఖ ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు.
ఏప్రిల్ 10 నాటికి ‘ప్రసాద్’ పూర్తికి కలెక్టర్ ఆదేశం
Comments
Please login to add a commentAdd a comment