అల్లిపురం: విశాఖలో ఏ చిత్రం నిర్మించినా విజయం సాధిస్తుందనే సెంటిమెంట్ తనకు ఉందని హీరో ప్రదీప్ మాచిరాజు అన్నారు. విశాఖ, అరకు పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుకున్న ఆయన తాజా చిత్రం ‘అక్కడ అమ్మాయి..ఇక్కడ అబ్బాయి’ విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఆదివారం హీరోయిన్ దీపిక, యూనిట్ నగరంలో సందడి చేసింది. ఈ సందర్భంగా ఓ హోటల్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ప్రదీప్ మాట్లాడారు. లవ్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపుదిద్దుకుందన్నారు. ఉదిత్ నారాయణ్ ఆలపించిన ‘ఎవ్వడో ఈడి కొచ్చినాడు సూడు’ అనే సూపర్‌హిట్‌గా నిలిచిందన్నారు. ఏప్రిల్ 11న వేసవిలో విడుదల కానున్న ఈ చిత్రం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆస్కార్ అవార్డు గ్రహీత చంద్రబోస్ రాసిన సాహిత్యం అద్భుతంగా ఉందని, సిద్ శ్రీరామ్ తన గాత్రంతో ఓ పాటను మరింత శ్రావ్యంగా ఆలపించారని కొనియాడారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం నేరమని ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. హీరోయిన్ దీపిక మాట్లాడుతూ ఈ సినిమా కథ తన పాత్ర చుట్టూ తిరుగుతుందని, ప్రేక్షకులందరూ చిత్రాన్ని ఆదరించాలని కోరారు.
బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం నేరం
‘అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయి’చిత్ర హీరో ప్రదీప్ మాచిరాజు