
రంజాన్‌కు ఏర్పాట్లు పూర్తి
యాసీన్ మసీదు
మహ్మదీయ మసీదు
జగదాంబ : రంజాన్ పండగను (ఈద్–ఉల్–ఫితర్) సోమవారం ఘనంగా జరుపుకోవాలని మౌల్వీలు ప్రకటించారు. నగరంలోని మసీదులు, ఈద్గాలు విద్యుత్ దీపాలతో అలంకరించారు. చెంగల్రావుపేట వద్ద ఉన్న జామీయా మసీదు, జగదాంబ దరి మక్కా మసీదు, చినవాల్తేరులో మహమ్మదీయ మసీదు, బుల్లయ్య కాలేజీ వద్ద ఉన్న యాసీన్ మసీదుతో పాటు అన్ని ప్రాంతాల్లో మసీదులు, ఈద్గాల్లో ఈద్ నమాజ్‌కు ఏర్పాట్లు చేశారు. నూతన దుస్తులు, టోపీలు, సెంట్లు, సూర్మాతో పాటు సేమియా, జీడిపప్పు, కిస్మిస్ కొనుగోళ్లతో మార్కెట్‌లో సందడి నెలకొంది.
నేడు ఈద్–ఉల్– ఫితర్
ముస్తాబైన మసీదులు, ఈద్గాలు

రంజాన్‌కు ఏర్పాట్లు పూర్తి