
బీచ్‌ల అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ
కొమ్మాది: రుషికొండ, సాగర్‌నగర్ బీచ్‌ల అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించి, అమలు చేయాలని అధికారులను కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ ఆదేశించారు. రుషికొండ బీచ్‌లో గురువారం జరిగిన బీచ్ మేనేజ్‌మెంట్ కమిటీ(బీఎంసీ) సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. రుషికొండ బీచ్‌లో మరిన్ని వసతులు కల్పించాలన్నా రు. టూరిస్ట్ ఇన్ఫర్మేషన్ సెంటర్, ఎక్కడికక్కడ సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. బ్లూ ఫ్లాగ్ బీచ్‌లో పని చేస్తున్న సిబ్బందికి ప్రత్యేక శిక్షణ నిర్వహించాలన్నారు. సాగర్‌నగర్ బీచ్‌ను బ్లూ ఫ్లాగ్ ప్రమాణాలకు అనుగుణంగా అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. రుషికొండ బీచ్‌లో మైరెన్ టవర్ పునరుద్ధరణ, మెట్ల నిర్మాణం, లైటింగ్ ఏర్పాటు, చిల్డ్రన్స్ పార్కు పునరుద్ధరణ, ఆక్రమణల తొలగింపు వంటి పనులు పూర్తి చేయాలన్నారు. మొక్కల చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని, గ్రే వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ బోర్డును ఏర్పాటు చేయాలన్నారు. టూరిజం ఆర్డీ జగదీష్, డీటీవో సుధాసాగర్ పాల్గొన్నారు.