ఒక్క హామీతో...మారిన జీవన రేఖ | - | Sakshi
Sakshi News home page

ఒక్క హామీతో...మారిన జీవన రేఖ

Published Thu, Feb 22 2024 12:52 AM | Last Updated on Thu, Feb 22 2024 5:47 PM

ఆనందం వ్యక్తం చేస్తున్న 1998 డీఎస్సీ అభ్యర్థులు - Sakshi

ఆనందం వ్యక్తం చేస్తున్న 1998 డీఎస్సీ అభ్యర్థులు

వీరఘట్టం: మీకు నేనున్నానంటూ భరోసా ఇచ్చేందుకు అప్పటి ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప పాదయాత్ర నేడు ఎందరో జీవితాల్లో వెలుగులు నింపింది. ముఖ్యంగా పాదయాత్ర సమయంలో 1998 డీఎస్సీ అభ్యర్థులకు జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీ..నేడు రాష్ట్రంలో వేలాది కుటుంబాలకు దారి చూపింది. కలగా మిగిలిన ఉపాధ్యాయ పోస్టులు పాతికేళ్ల తర్వాత తమకు చేతికి రావడంతో 1998 డీఎస్సీ అభ్యర్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 1998 డీఎస్సీ అభ్యర్థుల జీవితాలకు బంగారుబాట వేయడంతో ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో 739 మంది ఉపాధ్యాయ పోస్టులను సొంతం చేసుకున్నారు.

ఇదీ పోస్టు నేపథ్యం..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 1998లో డీఎస్సీ నోటిఫికేషన్‌ జారీ చేసింది. అభ్యర్థులకు కటాఫ్‌ మార్కులు నిర్ణయించి రిజర్వేషన్లను కేటాయించింది. అందులో ఓసీలకు 50, బీసీలకు 45, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 40 మార్కులుగా నిర్ణయించారు. ఆ మేరకు అర్హత సాధించిన వారిని ఇంటర్వ్యూలకు పిలిచారు. దీనికి సంబంధించి అప్పట్లో 221 జీఓ జారీచేశారు. కొన్ని విభాగాల్లో కటాఫ్‌ మార్కులు సాధించిన అభ్యర్థులు లేకపోవడంతో మరో జీఓ 618ను విడుదల చేసి కటాఫ్‌ మార్కులను 45, 40, 35గా నిర్ణయించారు. అదే సమయంలో ఉమ్మడి ఏపీలో ఉపఎన్నికలు రావడంతో ఈ ప్రక్రియ చాలా జిల్లాల్లో జరగలేదు. ఎన్నికలు పూర్తయిన తర్వాత జిల్లాలో 1:3 నిష్పత్తిలో ఇంటర్వ్యూలకు పిలిచారు.

రెండు జీఓల ప్రకారం అభ్యర్థులు హాజరయ్యారు. మొదటి జీఓ ప్రకారం ఎక్కువ కటాఫ్‌ మార్కులు వచ్చిన చాలామంది ఉద్యోగానికి అర్హత సాధించలేకపోయారు. అంతకు ముందు డీఎస్సీల్లో మిగిలిపోయిన వారికి రోస్టర్‌, సీనియార్టీ ప్రకారం ఖాళీ అయిన పోస్టులను కేటాయించేవారు. కానీ ఇక్కడ అలా జరగలేదు. దాంతో వారంతా ఏపీ అడ్మినిస్ట్రేటివ్‌ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. దాదాపు 11 ఏళ్ల పాటు విచారణ అనంతరం నష్టపోయిన అభ్యర్థులందరికీ ఉద్యోగాలు ఇవ్వాలని తీర్పు వచ్చింది. 2011లో హైకోర్టులో కూడా విచారణ జరిగాక ట్రిబ్యునల్‌ తీర్పును హైకోర్టు ధర్మాసనం సమర్థించింది. అయినా వారికి అప్పటి ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వకపోవడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అక్కడ కూడా వారికి అనుకూలంగా తీర్పు వచ్చినప్పటికీ గత టీడీపీ ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వకుండా వంచన చేసింది.

మాటకు కట్టుబడిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి..
998 డీఎస్సీ అభ్యర్థులకు అనుకూలంగా కోర్టులు తీర్పులు ఇచ్చినప్పటికీ గత టీడీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి మాత్రం తన పాదయాత్రలో ఇచ్చిన హామీకి కట్టుబడి 1998 డీఎస్సీ అభ్యర్థులకు పోస్టింగ్‌లు ఇచ్చేందుకు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో 2022 జూన్‌ 14న ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి 1998 డీఎస్పీ ఉపాధ్యాయుల ఫైల్‌పై సంతకం చేసి ఉద్యోగాలు ఇచ్చేందుకు గ్రీన్‌సిగ్నల్‌ ఇ చ్చారు. అలా నియామకాలు పొందిన వారికి మిని మం టైమ్‌ స్కేల్‌ కింద నెలకు రూ.34 వేలు వేత నం చెల్లిస్తూ వారి జీవితాల్లో వెలుగులు నింపారు.

సీఎం రుణం తీర్చుకోలేం
పాతికేళ్లుగా ఉద్యోగాల కోసం ఎదురుచూశా. మాకు ఉద్యోగాలు వస్తాయనే ఆశ వదులుకున్నాం. పాదయాత్రలో ఇచ్చిన మాటకు కట్టుబడి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి గతేడాది మా ఉద్యోగాలు మాకు ఇప్పించారు. నాకు ఉద్యోగం రావడంతో మా కుటుంబం మొత్తం ఎంతో ఆనందంగా ఉంది. ముఖ్యమంత్రి రుణం తీర్చుకోలేనిది.
వారణాసి నరసింగరావు, వీరఘట్టం

గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు
మాకు ఉద్యోగాలు ఇస్తామని గత ప్రభుత్వాలు ఎన్నో హామీలు ఇచ్చాయి. అయితే ఎవరూ మాగోడు పట్టించుకోలేదు. కాలంతో పాటు వయస్సు కూడా పెరుగుతుండడంతో ఇక ఉద్యోగాలు రావని నిరాశతో ఉన్న మాకు పాదయాత్రలో జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీ భరోసా ఇచ్చింది. ఇచ్చిన హామీ ప్రకారం ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి మాట నిలబెట్టుకున్నారు. గతేడాది ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో 739 మందికి ఉద్యోగాలు ఇచ్చి మా బకులకు దారి చూపించారు. ఆయన మేలు మరువలేం.
​​​​​​​బి.ఉమాకామేశ్వరరావు, సాలూరు

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/3

2
2/3

3
3/3

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement