విజయనగరం క్రైమ్ : అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మార్చి ఒకటో తేదీ నుంచి ఏడు వరకు జిల్లాలో మహిళా సాధికారత వారోత్సవాలు నిర్వహిస్తామని ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు. ఈ మేరకు స్థానిక పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో విద్యార్థినులు, మహిళల భద్రత.. పోలీస్ విధులపై అవగాహన కల్పించేందుకు ‘ఓపెన్ హౌస్‘ కార్యక్రమాన్ని శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వారోత్సవాల్లో భాగంగా మెడికల్ క్యాంపులు, వ్యాసరచన, వక్తృ త్వ, చిత్రలేఖనం పోటీలు నిర్వహిస్తామన్నారు. అలాగే ఓపెన్ హౌస్, ర్యాలీ కూడా చేపడతామని చెప్పారు. మహిళల భద్రత, రక్షణ, సమానత్వం, అభివృద్ధి, సాధికారతకు కృషి చేయాలన్న సంకల్పంతో జిల్లా వ్యాప్తంగా వివిధ కార్యక్రమాలను చేపడుతున్నామన్నారు.
BĶ欫§éÌS ˘
ప్రదర్శన..
పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించిన ఓపెన్‌హౌస్ కార్యాక్రమంలో భాగంగా పోలీసులు ఆయుధాలు ప్రదర్శించారు. తుపాకులు, బాంబ్ డిస్పోజల్స్ పరికరాలు, పోలీస్ డాగ్స్, డ్రోన్స్, సాంకేతికత, బాడీ వోర్న్ కెమెరాలు, ట్రాఫిక్, కమ్యూనికేషన్ విభాగాల్లో వినియోగిస్తున్న పరికరాలు ప్రదర్శించి, వాటి పనితీరును వివరించారు. అలాగే నేర స్థల పరిశీలనలో క్లూస్ టీమ్ ఆధారాలు, ఫింగర్ ప్రింట్స్ పని తీరుపై ప్రజలు, విద్యార్థులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, విజయనగరం డీఎస్పీ ఎం.శ్రీనివాసరావు, ఎస్బీ సీఐ ఏవీ లీలారావు, మహిళా పీఎస్ సీఐ ఈ.నర్సింహమూర్తి, వన్‌టౌన్ సీఐ ఎస్.శ్రీనివాస్, టూటౌన్ సీఐ టి.శ్రీనివాసరావు, ఆర్‌ఐలు ఎన్. గోపాలనాయుడు, ఆర్.రమేష్కుమార్, టి.శ్రీనివాసరావు, ఏఆర్, సివిల్ పోలీసు అధికారులు, సిబ్బంది, వివిధ పాఠశాలల విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఎస్పీ వకుల్ జిందల్
Comments
Please login to add a commentAdd a comment