
భిన్నకళా సంప్రదాయాల నిధి.. గిరిజన చిత్రకళ
విజయనగరం అర్బన్: దేశంలో గిరిజన చిత్రకళ.. భిన్న కళా సంప్రదాయాలకు నిధి అని, చిత్రకారులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని కేంద్రియ గిరిజన యూనివర్సిటీ వీసీ ఫొఫెసర్ టీవీ కట్టిమణి అన్నారు. వర్సిటీ, మాన్సాస్ విద్యాసంస్థలు సంయుక్తంగా ‘నేషనల్ ట్రైబల్ పెయింటర్స్ కాన్‌క్లేవ్’ పేరుతో రెండు రోజుల పాటు విజయనగరం కోటలోని రౌండ్ మహల్‌లో నిర్వహించనున్న గిరిజన చిత్రకారుల సమ్మేళనాన్ని ఆయన శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భారతదేశం కళలకు నిలయమని, వివిధ రాష్ట్రాల్లో వివిధ ఆచార వ్యవహారాలు, కట్టుబాట్లు, పద్ధతులు, కళలు విస్తరించి ఉంటాయన్నారు. స్వదేశీ కళారూపాలను ప్రోత్సహించడానికి భారతదేశం అంతటా ఉన్న గిరిజన చిత్రకారులను ఒక వేదికపైకి తేవడం సంతోషంగా ఉందన్నారు. గిరిజన చిత్రాలను, కళలను గౌరవించడమే దీని ప్రధాన ఉద్దేశంగా పేర్కొన్నారు. కర్నాటక రాష్ట్రం శివమొగ్గలోని కువెంపు విశ్వవిద్యాలయం వీసీ ప్రొఫెసర్ శరత్ అనంతమూర్తి మాట్లాడుతూ భారతీయ విజ్ఞాన వ్యవస్థలో అంతర్భాగమైన గిరిజన కళ ప్రాముఖ్యతను వ్యక్తీకరించి గౌరవించాలన్నారు. తొలుత జ్యోతిప్రజ్వలనలో మాన్సాస్ చైర్మన్ పి.అశోక్‌గజపతిరాజు, గోండ్ చిత్రకారిణి, ప్రద్మశ్రీ పురస్కార గ్రహీత దుర్గాబాయి పాల్గొన్నారు. ప్రదర్శనలో గోండ్, వార్లీ, పిథోర, కోలం, సోహ్రాయ్, ఖోవర్, కోయా, కురుంబా, తంగ్‌ఖుల్–నాగా, నాయకపోడు, సవర, సౌరా, మురియా, భిల్ వంటి విభిన్న కళారూపాలను ప్రదర్శించారు. కార్యక్రమంలో మాన్సాస్ కరస్పాండెంట్ డాక్టర్ కేవీఎల్ రాజు, స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ డాక్టర్ బీఎస్‌ఎన్ రాజు, గిరిజన యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ టి.శ్రీనివాసన్, ప్రొఫెసర్ శరత్ చంద్రబాబు, డాక్టర్ చితేంద్రమోహన్ మిశ్రా, వివిధ విభాగాల డీన్‌లు, అధిపతులు అనిరుద్‌కుమార్, వెంకటేశ్వర్లు, నగేష్, దేబంజన నాగ్, కె.దివ్య, ఎన్.వి.ఎస్.సూర్యనారాయణ, ఎం.జి.నాయుడు, విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం గిరిజన సంప్రదాయక సాంస్కృతిక కార్యక్రమాలతో ఆహుతులను అలరించారు.
గిరిజన యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ టి.వి.కట్టిమణి
జాతీయ గిరిజన చిత్రకారుల సమ్మేళనం

భిన్నకళా సంప్రదాయాల నిధి.. గిరిజన చిత్రకళ

భిన్నకళా సంప్రదాయాల నిధి.. గిరిజన చిత్రకళ
Comments
Please login to add a commentAdd a comment