విజ్ఞానం పెంపొందించిన సైన్స్ దినోత్సవం
విజయనగరం అర్బన్: విజయనగరం కంటోన్మెంట్ ఉన్నత పాఠశాలలో శనివారం నిర్వహించిన జిల్లా స్థాయి సైన్స్ దినోత్సవం విద్యార్థుల్లో విజ్ఞానం పెంపొందించింది. ప్రతిభను ప్రదర్శించేందుకు వేదికగా నిలిచింది. ‘ఎంపవరింగ్ ఇండియన్ యూత్ ఫర్ గ్లోబల్ లీడర్ షిప్ ఇన్ సైన్స్ అండ్ ఇన్నోవేషన్ ఫర్ వికసిత్ భారత్’ అనే అంశంపై విద్యార్థులకు జిల్లాస్థాయి క్విజ్, సెమినార్ పోటీలను శనివారం నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 27 మండలాల నుంచి క్విజ్ పోటీలకు 63 మంది, సెమినార్ పోటీలకు 25 మంది హాజరయ్యారు. విజేతలకు డీఈఓ యు.మాణిక్యంనాయుడు, ఏపీసీ డాక్టర్ ఎ.రామారావు జ్ఞాపికలను అందజేశారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఈఓలు కె.వి.రమణ, కె.మోహనరావు, తదితరులు పాల్గొన్నారు.
● విజేతలు వీరే..
క్విజ్ సీనియర్ విభాగం:
ప్రథమ స్థానం: టేకీ అన్నపూర్ణేశ్వరి (బాలికల ఉన్నత పాఠశాల, విజయనగరం), హేమలత (కేజీబీవీ, జామి), బండారు కీర్తన (జెడ్పీహెచ్‌ఎస్ గుర్ల), సంగిరెడ్డి హైమ (జెడ్పీహెచ్‌ఎస్ గురడబిల్లి), మద్దిల మోక్ష (జెడ్పీహెచ్‌ఎస్ అరసాడ).
ద్వితీయ స్థానం: సీహెచ్ సూర్యప్రకాష్ (జెడ్పీహెచ్‌ఎస్ గరివిడి), ఆర్.శివ (ఏపీమోడల్ స్కూల్, మేడపల్లి), జి.నేత్రాదేవి (జెడ్పీహెచ్‌ఎస్ గుర్ల), ఎల్.నిత్యసారథి (జెడ్పీహెచ్‌ఎస్, గరివిడి), ఐ.వైష్ణవి (జెడ్పీహెచ్‌ఎస్, కొట్యాడ).
క్విజ్ జూనియర్ విభాగం:
ప్రధమ స్థానం: కే.జనని (ఏపీమోడల్ స్కూల్, గర్భాం), ఎల్.ఇందుమతి నాయుడు (జెడ్పీహెచ్‌ఎస్, అరసాడ).
ద్వితీయ స్థానం: జి.మోహిత్ కుమార్ (ఏపీమోడల్ స్కూల్, పెదమేడపల్లి), వై.జ్ఞాన వైష్ణవి (ప్రభుత్వ బాలిక ఉన్నత పాఠశాల, గజపతినగరం).
సెమినార్ పోటీలు: కె.కీర్తన (కొత్తవలస), ఎం.కీర్తి (తెర్లాం), ఎస్.వైష్ణవి (గంట్యాడ)లు వరుస మూడుస్థానాల్లో నిలిచారు. వి.అవినాష్ (బొబ్బిలి), యు.చరిష్మ (వేపాడ) ప్రోత్సాహక బహుమతి అందుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment