పుణ్యగిరి ఆదాయం రూ.15,08,067లు
శృంగవరపుకోట: శివరాత్రి జాతర సందర్భగా పుణ్యగిరి దేవస్థానంలోని హుండీల నుంచి రూ.6,14,418లు ఆదాయం సమకూరినట్టు దేవదాయశాఖ అధికారులు తెలిపారు. పుణ్యగిరి శివాలయం, ధారగంగమ్మ ఆలయాల్లోని హుండీల ఆదాయాన్ని శనివారం లెక్కించారు. శివాలయంలోని హుండీల నుంచి రూ. 5,73,327లు, ధారగంగమ్మ ఆలయంలోని హుండీల నుంచి రూ.42,091లు వచ్చిందన్నారు. విశిష్ట దర్శనం టికెట్ల విక్రయంతో రూ.1,46,250లు, శీఘ్రదర్శనం టికెట్ల వల్ల రూ.5,39.560లు, కేశఖండన టికెట్ల అమ్మకంతో రూ.12,840లు, లడ్డూ ప్రసాదాల వల్ల రూ.1,03,095లు, పులిహోర కౌంటర్ నుంచి రూ.67,200లు, విరాళాల రూపంలో రూ.24,706లు కలిపి శివరాత్రి జాతరకు రూ.15,08,067లు ఆదాయం సమకూరిందన్నారు. లెక్కింపు కార్యక్రమాన్ని ఈఓలు కె.నాగేంద్ర, జి.శ్రీనివాస్ పర్యవేక్షించారు.
ప్రైవేట్ ఫిట్‌నెస్ కేంద్రాన్ని ఎత్తివేయాలి
విజయనగరం టౌన్: అచ్యుతాపురంలో ఏర్పాటుచేసిన ప్రైవేట్ ఫిట్‌నెస్ కేంద్రాన్ని వెంటనే ఎత్తివేయాలని ఏఐఎఫ్‌టీయూ (న్యూ అనుబంధం) ఆధ్వర్యంలో ఆటో కార్మికులు శనివారం ఆందోళన చేశారు. పార్కుగేట్ నుంచి గంటస్తంభం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ విజయదుర్గా ఆటోవర్కర్స్ యూనియన్ అధ్యక్ష, కార్యదర్శులు నీలాపు అప్పలరాజురెడ్డి, రెడ్డి నారాయణరావు మాట్లాడుతూ ఆర్టీఓ కార్యాలయ పనుల్లో దళారుల ప్రభావం లేకుండా చేయాలని ప్రైవేట్ ఫిట్‌నెస్ కేంద్రాన్ని ఏర్పాటుచేశామని చెబుతున్నా.. రూ.860ల చలానాతో పాటూ అదనంగా రూ.3,300 చెల్లిస్తే ఫిట్‌నెస్ లేకపోయినా కంప్యూటర్‌లో పాస్‌చేసేస్తున్నారని ఆరోపించారు. డ్రైవర్లను ఇబ్బందులకు గురిచేసే ప్రైవేట్ ఫిట్‌నెస్ కేంద్రాన్ని ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ర్యాలీలో చెన్నా ధర్మా, తర్లాడ శ్రీధర్, రాంబాబు, కృష్ణారావు, ఆటోడ్రైవర్లు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
పుణ్యగిరి ఆదాయం రూ.15,08,067లు
Comments
Please login to add a commentAdd a comment