ఇంటర్ తొలిరోజు పరీక్ష ప్రశాంతం
విజయనగరం అర్బన్: ఇంటర్మీడియట్ ఫస్టియర్ విద్యార్థులకు తొలిరోజు శనివారం నిర్వహించిన తెలుగు, సంస్కృతం పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. మొత్తం 18,686 మంది పరీక్షకు హాజరుకావాల్సి ఉండగా 18,178 మంది హాజరయ్యారు. ఒకేషనల్ కోర్సులో 2,980 మందికి 2,596 మంది హాజరైనట్టు ఆఐఓ మజ్జి ఆదినారాయణ తెలిపారు. కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విజయనగరం పట్టణంలోని పలు ప్రైవేటు, ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లోని పరీక్ష కేంద్రాల తనిఖీ చేశారు. అక్కడి వసతులను, వైద్య, తాగునీటి సదుపాయాలను పరిశీలించారు. కొన్ని చోట్ల తరగతి గదుల్లో వెలుగు తక్కువగా ఉండడంతో వెంటనే లైటింగ్ ఏర్పాటు చేయాలని, విద్యార్థుల సీటింగ్ విధానాన్ని మార్చా లని సూచించారు. ఆయన వెంట తహసీల్దార్ కూర్మనాథరావు, జిల్లా పరీక్షల కమిటీ సభ్యులు కె.అప్పారావు, తదితరులు పాల్గొన్నారు.
పలు పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన
కలెక్టర్ అంబేడ్కర్
ఇంటర్ తొలిరోజు పరీక్ష ప్రశాంతం
Comments
Please login to add a commentAdd a comment