● రూ.ఆరు లక్షలు విలువ చేసే బంగారు
ఆభరణాలు స్వాధీనం
విజయనగరం క్రైమ్: విజయనగరం రూరల్ పీఎస్ పరిధి జమ్ములో గత నెల 22న రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగి ఇంట్లో జరిగిన దొంగతనం కేసును రూరల్ పోలీసులు ఛేదించారు. ఈ మేరకు సదరు నిందితుడిని రూరల్ పోలీసులు అరెస్టు చేసి నిందితుడి దగ్గర నుంచి సుమారు రూ.ఆరు లక్షలు విలువ చేసే బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు రూరల్ పీఏస్‌లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ, సీఐ లక్ష్మణరావు, ఎస్సై అశోక్‌లు ఈ విషయంపై మాట్లాడారు. ఈ సందర్భంగా డీఎస్పీ శ్రీనివాస్ మాట్లాడుతూ నెల్లూరు జిల్లాకు చెందిన చల్లా ప్రతాప్‌రెడ్డి రెండు తెలుగు రాష్ట్రాల్లో 5 దొంగతనాలకు పాల్పడ్డాడని చెప్పారు. గత నెల ఫిబ్రవరిలో జమ్ములో రిటైర్డ్ బ్యాంకు ఎంప్లాయి ఇనుగంటి సూర్యనారాయణ తన ఇంటికి తాళం వేసి పెళ్లి నిమిత్తం యలమంచిలి వెళ్లారు. అదే రోజున గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి తలుపులు పగులగొట్టి బీరువాలో బంగారు అభరణాలను ఎత్తుకెళ్లారని రూరల్ పోలీస్‌స్టేషన్‌లో రిటైర్డ్ బ్యాంకు ఎంప్లాయి ఫిర్యాదు చేశారు. ఈ కేసు దర్యాప్తు చేపట్టిన ఎస్సై అశోక్ సీఐ లక్ష్మణరావు సూచనలతో నిఘా పెట్టగా సోమవారం నగరంలోని విజ్ఞాన భారతి స్కూల్ వద్ద బాబామెట్ట ద్వారకనగర్‌లో అనుమానాస్పదంగా తిరుగుతున్న ప్రతాప్‌రెడ్డిని పట్టుకుని విచారణచేయగా దొంగతనం విషయం బయట పడింది. నిందితుడి దగ్గర ఒక బంగారు నెక్లెస్, ఒక హారం, నాలుగున్నర జతల చెవి దిద్దులు, జతగొలుసు, ఒక గోల్డ్ చైన్‌తో కలిసి మొత్తం రూ.6లక్షలు విలువ చేసే బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నామని డీఎస్పీ వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment