నెల్లిమర్ల: కార్మికుల శాంతియుత పోరాటంతో జూట్‌మిల్లు తిరిగిందని జూట్‌మిల్ వర్కర్స్ యూనియన్ నాయకుడు కిల్లంపల్లి రామారావు అన్నారు. ఈ మేరకు సోమవారం మిల్లు తిప్పడానికి యాజమాన్యం నోటీసు జారీచేసి నిర్వహణ పనులు ప్రారంభించిన నేపథ్యంలో ఆయన గేట్‌మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కార్మికుల శాంతియుత పోరాటం ఫలితంగా మిల్లు తిరుగుతుందన్నారు. అలాగే గడిచిన 9నెలలుగా యాజమాన్యం అక్రమంగా లాకౌట్ చేసి కార్మికులను తీవ్ర ఇబ్బందులకు గురి చేసినా కార్మికుల శాంతియుత పోరాటంతో దఫా దఫాలుగా చర్చలు జరిపి ముందుగా బోనస్ సాధించి మిల్లు తిరగడానికి పార్టీల కతీతంగా కార్మికులు ఎంతో సహకరించారంటూ వారికి ధన్యవాదాలు తెలియజేశారు. అదేవిధంగా కార్మికులు ఇదే స్ఫూర్తిని కొనసాగించి సమస్యలు ఎదురైతే భవిష్యత్ పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment