
ముగిసిన మహాశివరాత్రి ఉత్సవాలు
వంగర: మండల పరిధిలో సంగాంలో వెలిసిన పవిత్ర సంగమేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ఏడు రోజుల పాటు జరిగిన మహాశివరాత్రి ఉత్సవాలు మంగళవారం ముగిశాయి. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి వేలాది మంది భ భక్తులు సువర్ణముఖి, వేగావతి, నాగావళి నదులు కలిసే త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించి సంగమేశ్వరస్వామిని దర్శించుకున్నారు.
పీటీసీలో న్యాయశాస్త్రంపై విద్యార్థులకు శిక్షణ
విజయనగరం క్రైమ్: స్థానిక కంటోన్మెంట్ పోలీస్ శిక్షణ కళాశాలలో న్యూక్రిమినల్ లాస్‌పై అన్న అంశంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. రెండు రోజుల పాటు జరిగే శిక్షణ కార్యక్రమాన్ని పీటీసీ ప్రిన్సిపాల్ టి.రామచంద్రరాజు మంగళవారం ప్రారంభించారు. క్రిమినల్ ప్రాసీజర్, ఎవిడెన్స్ యాక్ట్, ఇంటరాగేషన్ టెక్నిక్స్ తదితర అంశాలపై పీటీసీ విద్యార్థులకు శిక్షణ ఇచ్చారు. అనంతరం ప్రిన్సిపాల్ చేతుల మీదుగా స్టూడెంట్స్‌కు సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ పి.వి.అప్పారావు, డీఎస్పీ శ్రీకాంత్, డీఎస్పీ రమేష్, పలువురు సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.
ట్రైబల్ వెల్ఫేర్ పనులు పరిశీలించిన విజిలెన్స్ ఎస్పీ
పాచిపెంట: మండలంలోని గురివినాయుడుపేట వద్ద ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో నిర్మాణమవుతున్న ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలను శ్రీకాకుళం విజిలెన్స్ ఎస్పీ బర్ల ప్రసాదరావు పరిశీలించారు. ఈ మేరకు మంగళవారం ఆయన పాఠశాల భవన నిర్మాణాన్ని పరిశీలించి పనుల ప్రగతిపై ఆరా తీశారు. ఆమోదం పొందిన ప్లాన్ ప్రకారం నిర్మాణం జరుగుతున్నదీ..లేనిదీ తనిఖీచేస్తున్నామని, నాణ్యత పరీక్షలు చేసిన తరువాత ప్రభుత్వానికి నివేదిక పంపిస్తామన్నారు. కార్యక్రమంలో ఐటీడీఏ ఈఈ మణిరాజ్, డీఈ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
యూటీఎఫ్‌పై
బురద జల్లడం తగదు
పార్వతీపురంటౌన్: ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి బలపరిచిన అభ్యర్థి ఓటమిని అంగీకరించకుండా యూటీఎఫ్‌పై బురద జల్లడం మానుకోవాలని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎస్.మురళీ మోహనరావు మంత్రి అచ్చెంనాయుడికి సూచించారు. ఈ మేరకు మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలను రాజకీయం చేసి, కూటమి అభ్యర్థి ఓడిపోయిన తరువాత, గెలిచిన వారే మా అభ్యర్థి అనడం..అక్కడితో ఆగకుండా యూటీఎఫ్ ముసుగులో వైఎస్సార్‌సీపీ పోటీచేసిందనడం వారి రాజకీయ క్రీడలను సంఘాలకు ఆపాదించడం సరికాదన్నారు. ప్రభుత్వం ఏదైనా గానీ ఉపాధ్యాయులకు, విద్యారంగానికి వ్యతిరేకంగా నిర్ణయాలు చేస్తే నిలదీసే తత్వం ఉన్న సంఘం కాబట్టే సుమారు 6వేల ఓట్లు వచ్చాయన్నారు. భవిష్యత్‌లో నైనా ఇటువంటి చౌకబారు ఆరోపణలు మానుకోవాలని ఆయన హితవు పలికారు.
బైక్‌పైనుంచి జారిపడి యువకుడి మృతి
చీపురుపల్లి: పట్టణంలోని ఆంజనేయపురంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కుడుముల బంగారునాయుడు(32) అనే యువకుడు మృతిచెందాడు. మంగళవారం సాయంత్రం జరిగిన ఈ సంఘటనకు సంబంధించి హెచ్‌సీ రమణ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గరివిడి మండలంలోని రేగటి గ్రామానికి చెందిన కుడుమల బంగారు నాయుడు, శనపతి రాము కలిసి ద్విచక్ర వాహనంపై చీపురుపల్లిలోని అమ్మవారి జాతరకు వచ్చారు. తిరిగి తమ గ్రామానికి వెళ్తుండగా వాహనం నడుపుతున్న శనపతి రాము ఆంజనేయపురంలో సడన్‌గా బ్రేక్ వేయడంతో వెనుక కూర్చున్న బంగారునాయుడు ద్విచక్ర వాహనం నుంచి కింద పడిపోగా తలకు బలమైన గాయమైంది. దీంతో తక్షణమే సమీపంలో ఉన్న ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ముగిసిన మహాశివరాత్రి ఉత్సవాలు

ముగిసిన మహాశివరాత్రి ఉత్సవాలు
Comments
Please login to add a commentAdd a comment