పార్వతీపురం టౌన్: గరుగుబిల్లి మండలం ఉద్దవోలు గ్రామానికి చెందిన నాగళ్ల సింహాచలం(55) పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు, ఈ ఘటనపై పార్వతీపురం జిల్లా ఆస్పత్రి అవుట్‌పోస్ట్ పోలీసులు మంగళవారం తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కొమరాడ మండలం కళ్లికోట గ్రామానికి చెందిన గౌరీ శంకరరావు దగ్గర గొర్రెల కాపరిగా సింహాచలం పనిచేస్తున్నాడు. సింహాచలం కుమారుడు విశాఖపట్నంలో పనిచేస్తున్నాడు. కుమారుడికి ఎన్ని మార్లు ఫోన్ చేసినా స్పందన లేకకోవడంతో మనస్తాపం చెంది సోమవారం సాయంత్రం గుమడ గ్రామ సమీపంలో ఉన్న ఇటుకబట్టీల వద్దకు వెళ్లి పురుగు మందు తాగేశాడు. గమనించిన యజమాని గౌరీశంకరరావు వెంటనే తన మోటార్ సైకిల్‌పై పార్వతీపురం జిల్లా ఆస్పత్రికి తీసుకు రావడంతో వైద్యులు చికిత్స అందజేస్తుండగా మంగళవారం ఉదయం మృతిచెందాడు. గరుగుబిల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అవుట్‌పోస్టు ఏఎస్సై నిమ్మకాయల భాస్కరరావు తెలిపారు.
ఉరి వేసుకుని వ్యక్తి..
సాలూరు: పట్టణంలోని దుర్గానవీధిలో నివాసముంటున్న షేక్ ఖలీల్ (29)ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఫిర్యాదు అందిందని సీఐ అప్పలనాయుడు తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన మాట్లాడుతూ, సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో షేక్ ఖలీల్ ఫ్యాన్‌కు ఉరివేసుకున్నట్లు మృతుడి భార్య షేక్ భువనేశ్వరి ఫిర్యాదులో పేర్కొన్న మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తుచేస్తున్నామన్నారు.
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
పార్వతీపురం రూరల్: మండలంలోని పార్వతీపురం–నర్సిపురం రహదారి పరిధిలో ఈనెల 2న జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాల పాలైన కొల్లి బాలాజీ (34) విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందాడు. ఈ మేరకు మృతుడి భార్య రూరల్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై బి.సంతోషి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment