
కనీస వేతనం చెల్లించాలి
● ఏపీ సమగ్రశిక్ష అవుట్ సోర్సింగ్
ఎంప్లాయీస్ ఫెడరేషన్ డిమాండ్
● జిల్లా వ్యాప్తంగా మధ్యాహ్న భోజన విరామ సమయంలో నిరసన
విజయనగరం అర్బన్: కనీస వేతనం అందజేయాలని ఏపీ సమగ్రశిక్ష అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు డిమాండ్ చేశారు. జిల్లా వ్యాప్తంగా కేజీబీవీల ఎదుట బుధవారం మధ్యాహ్న భోజన విరామ సమయంలో ఆందోళన చేశారు. సమ్మె ఒప్పందాల మేరకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కూటమి ప్రభుత్వాన్ని కోరారు. ఈపీఎఫ్ అమలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో వెయిటేజీ, కారుణ్య నియామకాలు, నిర్ధిష్టమైన జాబ్ చార్టు, పదవీ విరమణ వయసు 62 ఏళ్లకు పెంపు, గ్రాట్యూటీ అమలు, ప్రతినెలా 1వ తేదీన వేతనాల చెల్లింపు తదితర డిమాండ్‌లు నెరవేర్చాలన్నారు. దీనికోసం ఈ నెల 11వ తేదీన విజయవాడ కేంద్రంలో నిరసన దీక్ష చేస్తామని ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర చైర్మన్ బి.కాంతారావు తెలిపారు. వివిధ మండలాల్లో చేపట్టిన నిరసనగా రాష్ట్ర కార్యవర్గం సభ్యులు రామకృష్ణ, ఉమామహేశ్వరరావు, లక్ష్మణరావు, శ్రీనివాస్, సతీష్, సర్వేశ్వరరావు, సీఆర్‌ఎంటీ నాయకులు రామకృష్ణ, కేజీవీబీ రాష్ట్ర నాయుకులు పి.తేజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.
నేడు మద్యం షాపుల లాటరీ
● కల్లుగీత, సొండి కులాలకు విజయనగరం జిల్లాలో 16, పార్వతీపురం మన్యం జిల్లాలో నాలుగు షాపులు
సాక్షి ప్రతినిధి, విజయనగరం: ఉభయ విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో కల్లుగీత, సొండి కులాలకు కేటాయించిన 20 మద్యం షాపులకు సంబంధించిన లాటరీ ప్రక్రి య గురువారం నిర్వహించనున్నారు. కూటమి ప్రభుత్వం కొత్త మద్యం విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చిన తర్వాత ఇప్పటికే విజయనగరం జిల్లాలో 153, పార్వతీపురం మన్యం జిల్లాలో 52 మద్యం దుకాణాలను ప్రైవేట్ వ్యాపారులకు అప్పగించిన సంగతి తెలిసిందే. వాటికి ఇప్పుడీ 20 అదనం. జిల్లా యూనిట్‌గా కల్లు గీత, సొండి సామాజికవర్గాల వారికి వీటిని కేటాయించారు. శెట్టిబలిజ, యాత, సెగిడి, శ్రీసైన, సొండి సామాజిక వర్గాలకు చెందినవారు విజయనగరం జిల్లాలోని 16 దుకాణాల్లో కోటా ప్రకారం ఎక్కడివాటికై నా దరఖాస్తు చేసుకోడానికి అవకాశం ఇచ్చారు. అలా 308 దరఖాస్తులు వచ్చా యి. పార్వతీపురం మన్యం జిల్లాలో శ్రీసైన, సెగిడి, సొండి కులస్తులు నాలుగు దుకాణాల్లో కోటా ప్రకారం దరఖాస్తు చేసుకోవడానికి వెసులుబాటు కల్పించారు. దీంతో 60 దరఖాస్తులు దాఖలయ్యాయి.
‘లాటరీ’ ద్వారా కేటాయింపు...
జిల్లా యూనిట్‌గా కోటా ప్రకారం దరఖాస్తు చేసుకోవడానికి ఒక్కో దరఖాస్తుకు రూ.2 లక్షల చొప్పున ప్రభుత్వం ఫీజు నిర్ణయించింది. ఏ4 మద్యం దుకాణాలను లాటరీ పద్ధతిలో కేటాయిస్తారు. ఫిబ్రవరి 6వ తేదీ వరకూ దరఖాస్తులు స్వీకరించారు. గత నెల 10వ తేదీన ఉభయ జిల్లాల్లో లాటరీ తీయడానికి ఏర్పాట్లు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో వాయిదా వేశారు. ఆ ప్రక్రియను ఈ నెల 6వ తేదీన నిర్వహించనున్నట్లు ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ ఆఫీసర్ బి.శ్రీనాథుడు తెలిపారు. విజయనగరం జిల్లా లోని దుకాణాలకు సంబంధించి కలెక్టరేట్ కాంప్లెక్స్‌లోని ఆడిటోరియంలో ఉదయం 9 గంటలకు లాటరీ తీస్తారు. పార్వతీపురం మన్యం జిల్లాలో దరఖాస్తుదారులకు కూడా అదే సమయానికి కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాల్‌లో లాటరీ నిర్వహిస్తారు.
శ్రీరాముడే ఆదర్శం
● త్రిదండి చినజియర్ స్వామి
పార్వతీపురం: ప్రతి ఒక్కరూ శ్రీరాముడును ఆదర్శంగా తీసుకొని కుటుంబ, రాజ్యవ్యవస్థ ను నిర్వహించాలని త్రిదండి చినజీయరుస్వామి పిలుపునిచ్చారు. సర్వజీవరాశులను పరిరక్షించాల్సిన బాధ్యత మనుషులదేనన్నారు. పార్వతీపురం పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో వికాస తరంగణి అధ్యక్షుడు యిండుపూరు గున్నేశ్వరరావు అధ్యక్షతన బుధవారం నిర్వహించిన శ్రీరామ పాదుకా పట్టాభిషేకం వైభవంగా సాగింది. కార్యక్రమంలో పాల్గొన్న చినజియర్ స్వామి మాట్లాడుతూ పూర్వం సంప్రదాయలకు విలువ ఇచ్చేవారని, అందుకే వారంతా ఎంతో సుఖసంతోషాలతో జీవించేవారన్నారు. సమాజంలో జీవించే ప్రతిఒక్కరూ మంచిని కోరుకోవాలన్నారు. అనంతరం శ్రీరామ పట్టాభిషేకం పూజలను జరిపారు. భక్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు.

కనీస వేతనం చెల్లించాలి
Comments
Please login to add a commentAdd a comment