
మెనూ అమలు చేయకుంటే చర్యలు
లక్కవరపుకోట:
సాంఘిక సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న హాస్టల్స్‌లో ప్రభుత్వం సూచించిన మెనూ కచ్చి తంగా అమలుచేయాలని, లేదంటే కఠిన చర్యలు తప్పవని ఆ శాఖ డీడీ బి.రామానందం హెచ్చరించారు. ఎల్.కోట ఎస్సీ బాలుర వసతిగృహ విద్యా ర్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై ‘ఆరుబయట స్నానం.. నేలపైనే నిద్ర’ అనే శీర్షికన ‘సాక్షి’లో బుధవారం ప్రచురితమైన వార్తకు సాంఘిక సంక్షేమశాఖ డీడీ స్పందించారు. వసతి గృహాన్ని పరిశీలించారు. హాస్టల్‌లో మెనూ అమలు, సౌకర్యాలపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. పాలు, పండ్లు ఇవ్వడంలేదని, మెనూ అమలుచేయడంలేదని డీడీకి విద్యార్థులు తెలిపారు. మంచినీటి ట్యాంక్ పగిలిపోయి నెలలు గడుస్తున్నా మరమ్మతులు చేయించకపోవడంపై వార్డెన్ కొల్లు గౌరినాయుడుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. డీడీ దగ్గరుండి కొత్త వాటర్ ట్యాంక్‌ను, వంట చేసేందుకు అనువుగా పొయ్యిని ఏర్పాటుచేయించారు. మెనూలో పొందుపర్చిన వంటలను కచ్చితంగా వడ్డించాల్సిందేనని, లేదంటే నేరుగా ఫోన్‌చేసి తెలియజేయాలని విద్యార్థులకు తన ఫోన్‌నంబర్‌ను ఇచ్చారు. అనంతరం ఆయన మాట్లాడు తూ వసతిగృహ సమస్యలను గుర్తించామని, మెనూ అమలుతో పాటు మౌలిక సదుపాయాల కల్పనకు కృషిచేస్తామన్నారు. వసతిగృహ నిర్వహణలో నిర్లక్ష్యం, మెనూ చార్టు అమలుచేయకపోవడంపై హాస్టల్ వార్డెన్‌కు షోకాజ్ నోటీస్ జారీచేశామన్నారు. నివేదికను కలెక్టర్‌కు అందజేసి తదపరి చర్యలు తీసుకుంటామని డీడీ తెలిపారు.
సాంఘిక సంక్షేమశాఖ డీడీ రామానందం
ఎల్.కోట ఎస్సీ బాలుర వసతిగృహం
సందర్శన
మెనూ అమలు, సమస్యలను విద్యార్థులను అడిగి తెలుసుకున్న డీడీ
హాస్టల్ వార్డెన్‌కు షోకాజ్ నోటీస్ జారీ

మెనూ అమలు చేయకుంటే చర్యలు

మెనూ అమలు చేయకుంటే చర్యలు
Comments
Please login to add a commentAdd a comment