రేపు జాతీయ లోక్ అదాలత్
విజయనగరం లీగల్: ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఈ నెల 8న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్‌ను కక్షిదారులందరూ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షుడు బి.సాయికళ్యాణ్ చక్రవర్తి కోరారు. రాజీపడదగిన క్రిమినల్ కేసులు, మోటారు ప్రమాద బీమా, బ్యాంకు చెక్కు బౌన్స్ కేసులు, ప్రాంసరీ నోట్, ఎలక్ట్రిసిటీ, ప్రీ లిటిగేషన్ కేసులను రాజీ మార్గంలో పరిష్కరించుకోవాలని గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
గురుకులాల్లో ప్రవేశాలకు గడువు పెంపు
విజయనగరం అర్బన్: ఉమ్మడి విజయనగరం జిల్లాలోని ఏపీ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో ప్రవేశ దరఖాస్తుకు ఈ నెల 13 వరకు గడువు పెంచినట్టు గురుకులాల సమన్వయకర్త శంబాన రూపవతి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఐదోతరగతి, ఇంటర్మీడియట్‌లో ప్రవేశాలకు ‘ఏపీపీఆర్‌ఏజీసీఈటీ.ఏపీసీఎఫ్‌ఎస్‌ఎస్.ఐఎన్’ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.
ఆర్టీసీ బస్సు డ్రైవర్లకు ప్రశంసలు
విజయనగరం అర్బన్: జిల్లా కేంద్రం నుంచి ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన మహా కుంభమేళాకు వెళ్లిన భక్తులకు సురక్షిత ప్రయాణ సేవలందించిన ఆర్టీసీ బస్సు డ్రైవర్లను జిల్లా ప్రజా రవాణా అధికారి సీహెచ్ అప్పలనారాయణ అభినందించారు. ప్రయాణికుల విశేష ఆదరణ పొందిన ఐదుగురు డ్రైవర్లకు జ్ఞాపికలు, బహుమతులను ఆర్టీసీ డీపో ప్రాంగణంలో గురువారం అందజేశారు. కుంభమేళాకు నడిపిన ఐదు బస్సుల నుంచి రూ.12లక్షల వరకు ఆదాయం సమకూరిందని డిపో మేనేజర్ జె.శ్రీనివాసరావు తెలిపారు. కార్యక్రమంలో డీపీ సీఐ ఆదినారాయణ, డిపో సూపర్‌వైజర్లు, సిబ్బంది పాల్గొన్నారు.
సజావుగా మద్యం షాపుల లాటరీ ప్రక్రియ
విజయనగరం అర్బన్: జిల్లాలో గీత/సొండి కులాలకు కేటాయించిన మద్యంషాపుల కోటా లాటరీ ప్రక్రియ విజయనగరం కలెక్టరేట్ సమావేశ మందిరంలో గురువారం సజావుగా సాగింది. జిల్లా రెవెన్యూ అధికారి ఎస్.శ్రీనివాసమూర్తి సమక్షంలో సంబంధిత కులాల కోటాగా 16 షాపులను కేటాయించారు. షాపుల కోసం 308 దరఖాస్తులు నమోదు కాగా వీటి ఫీజుల రూపంలో రూ.6.16 కోట్లు లభించిందని జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అధికారి బి.శ్రీనాధుడు తెలిపారు. 16 మద్యం షాపులకు మొదటి విడత లైసెన్స్‌ఫీజు రూపంలో రూ.84.50 లక్షల ఆదాయం వచ్చిందన్నారు.
ఈ నెల 8 నుంచి పీ–4 సర్వే
విజయనగరం అర్బన్: పబ్లిక్ ప్రైవేటు పీపుల్స్ పార్టిసిపేషన్ (పీ–4) సర్వేను ఈ నెల 8 నుంచి 18వ తేదీ వరకు జరుగుతుందని కలెక్టర్ డా.బీఆర్ అంబేడ్కర్ తెలిపారు. సచివాలయ, గ్రామ స్థాయిలో పనిచేసే సిబ్బంది సర్వేలో పాల్గొంటారని, ఎంపీడీఓలు పర్యవేక్షణ అధికారులుగా వ్యవహరించాలని సూచించారు. కలెక్టర్ సమావేశ మందిరంలో జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి ఆధ్వర్యంలో పీ–4 సర్వేపై ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు, మండల ప్రత్యేకాధికారులకు గురువారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జీరో పేదరికమే లక్ష్యంగా ప్రభుత్వం పీ–4 కార్యక్రమాన్ని తలపెట్టిందన్నారు. పేదరికంలో ఉన్న 20 శాతం మందికి వివిధ రకాలుగా తోడ్పాటునందిస్తుందన్నారు. ఈ నెల 21, 22తేదీల్లో గ్రామ సభలను నిర్వహించి, 27వ తేదీన తుది నివేదిక అందజేయాలని, ఉగాది సందర్భంగా 30న ముఖ్యమంత్రి చంద్రబాబు పాలసీని ప్రారంభిస్తారని తెలిపారు. సమావేశంలో డీఆర్వో శ్రీనివాసమూర్తి పాల్గొన్నారు.
రేపు జాతీయ లోక్ అదాలత్
రేపు జాతీయ లోక్ అదాలత్
Comments
Please login to add a commentAdd a comment