
41 గ్యాస్ సిలిండర్ల సీజ్
విజయనగరం ఫోర్ట్: జిల్లాలో డొమెస్టిక్ సిలిండర్లను అక్రమంగా వాడుతున్న హోటల్స్, రెస్టారెంట్స్, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్స్‌పై సివిల్ సప్లయిస్ అధికారులు శుక్రవారం ఆకస్మికంగా దాడులు చేశారు. సివిల్ సప్లయిస్ డిప్యూటీ తహసీల్దార్లు రెండు బృందాలుగా ఏర్పడి తనిఖీలు నిర్వహించారు. విజయనగరం, డెంకాడ, గజపతినగరం మండలాల్లో 8 చోట్ల 6ఎ కేసులు నమెదు చేసి 25 సిలిండర్లు సీజ్ చేశారు. అదేవిధంగా చీపురుపల్లి, రాజాం, గరివిడి మండలాల్లో 7 చోట్ల ఏడు 6 ఎ కేసులు నమోదు చేసి 16 సిలిండర్లను సీజ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment