● ఆడపిల్ల ఓ అదృష్టం
ఆడపిల్ల పుట్టిందంటే ప్రతి కుటుంబం సంతోషించాలి. లక్ష్మీదేవి పుట్టిందని ఆనంద పడాలి. మహిళల పట్ల అక్కడక్కడ వివక్ష ఉంది. ఇది పోవాలి. ప్రాథమిక విద్య చదువుతున్నప్పటి నుంచి డాక్టర్ కావాలన్నది నా కోరిక. మా నాన్న విద్యావంతుడు కావడంతో కోరిక తగ్గట్టుగా వైద్యవిద్యను చదివించారు. మరో ఇద్దరు చెల్లెళ్లను కూడా ఉన్నత చదువులు చదివించారు. ముగ్గురం ఆడపిల్లలమే అయినా మగ పిల్లలతో సమానంగా రాణించేలా ప్రోత్సహించారు. తల్లిదండ్రుల కష్టాన్ని వమ్ముచేయకుండా ముగ్గురం క్రమశిక్షణ, పట్టుదలతో చదివాం. మేము చదువుకునే రోజుల్లో 125 మంది ఎంబీబీఎస్ విద్యార్థులకు 85 మంది పురుషులు ఉంటే 40 మంది మాత్రమే మహిళలు ఉండేవారు. నేడు ఎక్కువ మంది బాలికలే వైద్య విద్యను అభ్యసించడం శుభపరిణామం. భుజం తట్టి ప్రోత్సహిస్తే మహిళలు పురుషులు కంటే గొప్పగా రాణిస్తారు. ఊయలను ఊపే స్థాయి నుంచి మహిళలు తారాస్థాయికి ఎదిగారు. అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. – డాక్టర్ జి.వి.రాజ్యలక్ష్మి, డీసీహెచ్‌ఎస్
Comments
Please login to add a commentAdd a comment