
గడ్డి ట్రాక్టర్‌ను ఢీకొన్న గుర్తు తెలియని లారీ
కొత్తవలస : మండలంలోని అరకు – విశాఖ జాతీయ రహదారిలో నిమ్మలపాలెం జంక్షన్ సమీపంలో గల సూర్య ఐటీఐ వద్ద ముందు వెళ్తున్న గడ్డి ట్రాక్టర్‌ను వెనుక నుంచి గుర్తు తెలియని లారీ శనివారం ఢీకొట్టింది. ఎల్.కోట మండలం కళ్లేపల్లి నుంచి వరి గడ్డితో ట్రాక్టర్‌పై నుంచి కొత్తవలస వెళ్తుండగా వెనుక నుంచి అతి వేగంగా గుర్తు తెలియని లారీ వచ్చి ఢీకొట్టింది. దీంతో గడ్డి లోడుతో ఉన్న ట్రాక్టర్ బోల్తా పడింది. ట్రాక్టర్ డ్రైవర్ తెరుకునే లోపే లారీ అతివేగంగా తప్పించుకుపోయింది. ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. జేసీబీ సాయంతో గడ్డి ట్రాక్టర్‌ను రోడ్డు సేఫ్టీ పోలీస్‌లు దగ్గరుండి పక్కకు తొలిగించారు.
గడ్డి ట్రాక్టర్ దగ్ధం
గజపతినగరం రూరల్: మండలంలోని గంగచోళ్లపెంట గ్రామంలో శనివారం జరిగిన అగ్ని ప్రమాదంలో విద్యుత్ వైర్లుకు గడ్డి ట్రాక్టరు తగలడంతో దగ్ధమైంది. సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన కనకల సూర్యనారాయణకు చెందిన ట్రాక్టరులో ఎండు గడ్డిని ఎక్కించి తీసుకువెళ్తుండగా మార్గ మద్యలో ఉన్న విద్యుత్ వైర్లు తగలడంతో షార్ట్ సర్క్యూట్ జరిగి మంటలు వ్యాపించి గడ్డితో పాటు ట్రాక్టరు పూర్తిగా కాలిపోయింది. ప్రమాద సంఘటన విషయాన్ని గజపతినగరం అగ్ని మాపక కేంద్రానికి సమాచారం ఇవ్వడంతో అగ్ని మాపక సిబ్బంది వాహనంతో వచ్చి మంటలను అదుపు చేశారు. అప్పటికే ట్రాక్టరు పూర్తిగా కాలి పోయింది.
కుల దూషణపై అట్రాసిటీ కేసు
బొండపల్లి: మండలంలోని కొత్తపాలెం సచివాలయం వెల్ఫేర్ సహాయకుడుగా పని చేస్తున్న ఉద్యోగిపై కుల దూషణ చేసినట్లు ఉద్యోగి ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు నిర్వహించి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ యు.మహేష్ తెలిపారు. ఈ నెల 1న సామాజిక భద్రత పింఛన్లను పంపిణీ చేసేందుకు యడ్లపాలెం గ్రామానికి చెందిన వెల్ఫేర్ సహాయకుడు గొర్లె సతీష్‌కుమార్ వెళ్లాడు. మజ్జి అప్పయ్యమ్మ ఇంటికి పింఛన్ ఇచ్చేందుకు వెళ్లగా సెల్ సిగ్నల్స్ పని చేయకపోవడంతో పక్క ఇంటికి వెళ్లి పింఛన్ అందించడానికి వెళ్లాడు. ఈ క్రమంలో మా అమ్మకు పింఛన్ ఇవ్వకుండా పక్క ఇంటికి ఎందుకెళ్లావు? అని అప్పయ్యమ్మ కుమారుడు బంగారునాయుడు కులం పేరిట దూషించినట్టు పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. ఈ మేరకు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ డీఎస్పీ వీరాకుమార్ దర్యాప్తు నిర్వహించి కేసు నమోదు చేశారు.
మిస్సింగ్ కేసు నమోదు
పార్వతీపురం రూరల్: పార్వతీపురం పట్టణంలో గల ఎస్‌ఎన్‌పీ కాలనీకి చెందిన జె.సత్తిరాజు ఈ నెల 5వ తేదీన ఉదయం 6గంటలకు తన రోజువారీ పనుల నిమిత్తం బయటకు వెళ్లి తిరిగి ఇంటికి రాకపోవడంతో భార్య సౌజన్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు అదృశ్యం కేసు నమోదు చేసినట్టు పట్టణ ఎస్‌ఐ గోవిందరావు శనివారం తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ చెప్పారు.
గడ్డి మందు తాగి వ్యక్తి మృతి
మక్కువ : మండలంలోని పాయకపాడు గ్రామానికి చెందిన సామంతుల స్వామినాయుడు (29) మనస్తాపంతో గడ్డి మందు తాగి, వైద్య చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం స్వామినాయుడు ఈ నెల 6వ తేదీన ఉదయం ఇంటి వద్ద గడ్డి మందు తాగడంతో స్థానికులు గమనించి మక్కువలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రధమ చికిత్స చేసి మెరుగైన వైద్యం నిమిత్తం విజయనగరం మహారాజ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. గత కొంతకాలంగా ఏ పని చేయకుండా ఖాళీగా ఉండడంతో కుటుంబ సభ్యులు మందలించారు. దీంతో మనస్తాపానికి గురైన స్వామినాయుడు గడ్డి మందు తాగాడు. మృతుడికి వివాహమై ఏడాదైంది. భార్య శిరీష ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఏఎస్‌ఐ ఎం.శ్రీనివాసరావు తెలిపారు.

గడ్డి ట్రాక్టర్‌ను ఢీకొన్న గుర్తు తెలియని లారీ
Comments
Please login to add a commentAdd a comment