
త్రుటిలో తప్పిన ప్రమాదం
పాలకొండ రూరల్: నిత్యం రద్ధీగా ఉండే స్థానిక ప్రధాన మార్కెట్‌కు ఆనుకుని ఉన్న జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల ప్రహరీ గోడ ఒక్కసారిగా నేలకొరిగింది. నెలలో రెండవ శనివారం పాఠశాలకు సెలవు కావటం, గోడకు మరోవైపు ఉన్న మార్కెట్‌లో ఆ సమయంలో ఎవ్వరూ లేకపోవటంతో పెద్ద ప్రమాదమే తప్పింది. ఉన్నట్లుండి పెద్ద శబ్ధంతో ఈ భారీ గోడ కూలటంతో చుట్టపక్కల వారు అక్కడి చేరుకుని పరిస్థితిని పాఠశాల యాజమాన్యానికి తెలియజేశారు. ఈ ఘటనతో ఎటువంటి సమస్య తలెత్తకపోవటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. విషయం తెలుసుకున్న పాఠశాల హెచ్‌ఎం బి.శ్రీదేవి శాఖాపరమైన ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళతామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment