కంటి పరీక్షల శిబిరం ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

కంటి పరీక్షల శిబిరం ప్రారంభం

Published Tue, Feb 18 2025 1:33 AM | Last Updated on Tue, Feb 18 2025 1:32 AM

కంటి పరీక్షల  శిబిరం ప్రారంభం

కంటి పరీక్షల శిబిరం ప్రారంభం

ఎంజీఎం : జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో దృష్టిలోపం గుర్తించిన 2,334 విద్యార్థులకు రీ స్క్రీనింగ్‌ చేసి అవసరమైన వారికి కళ్లజోళ్ల పంపిణీ, చికిత్స అందించేందుకు వరంగల్‌ ప్రాంతీయ నేత్ర వైద్యశాలలో కంటి పరీక్షల శిబిరా న్ని సోమవారం ప్రారంభించారు. డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ అప్పయ్య ఆదేశాల మేరకు ఎనిమిది రోజుల పాటు రోజుకు 300 మంది విద్యార్థుల చొప్పున కంటి పరీక్షలు నిర్వహించనున్నట్లు వైద్యాధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో నోడల్‌ అధికారి డాక్టర్‌ మహేందర్‌, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ విజయకుమార్‌, రీజనల్‌ కంటి ఆస్పత్రి ఇన్‌చార్జ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ప్రమీల, ఆర్‌బీఎస్‌కే వైద్యాధికారులు దుర్గాప్రసాద్‌, కుమారస్వామి, ప్రదీప్‌రెడ్డి, రవీందర్‌, ఆప్తాలమిక్‌ అధికారులు రవీందర్‌రెడ్డి, మల్లారెడ్డి, రవికుమార్‌ పాల్గొన్నారు.

105 మంది విద్యార్థినులకు

ప్రాంగణ నియామకాలు

కేయూ క్యాంపస్‌: కాకతీయ యూనివర్సిటీలోని మహిళా ఇంజనీరింగ్‌ కళాశాల బీటెక్‌ ఫైనలియర్‌ విద్యార్థినులు 105 మంది వివిధ సాఫ్ట్‌వేర్‌ సంస్థల ఉద్యోగాలకు ఎంపికయ్యారని కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ కె.భిక్షాలు తెలిపారు. ఇన్ఫోసిస్‌లో ఇద్దరు, డిజిగీక్స్‌లో ముగ్గురు, జెన్‌పాక్ట్‌లో 35 మంది, డెల్ఫిటీవీఎస్‌లో 18 మంది, క్యూస్ప్రైడర్‌లో 33 మంది, పెంటగాన్‌ స్పేస్‌లో 10 మంది, ఎకోట్రైన్స్‌లో నలుగురు ఎంపికయ్యారని, వీరికి వార్షిక వేతనం రూ.3.2 లక్షల నుంచి రూ 4.5 లక్షల వరకు ఉన్నట్లు పేర్కొన్నారు. జూన్‌లో జాయినింగ్‌ అవుతారు. మధ్యలో ఇంటర్న్‌షిప్‌ ఉంటుందని వివరించారు. ఈమేరకు సోమవారం కేయూ సెనెట్‌హాల్‌లో వీసీ కె.ప్రతాప్‌రెడ్డి, రిజిస్ట్రార్‌ వి.రామచంద్రం విద్యార్థినులను అభినందించారు. కళాశాల అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

జైళ్లశాఖ డీజీపీని

కలిసిన సీపీ

వరంగల్‌ క్రైం: రాష్ట్ర జైళ్లశాఖ డీజీపీ సౌమ్య మిశ్రాను వరంగల్‌ కమిషనర్‌ అంబర్‌ కిశోర్‌ఝా సోమవారం మర్యాదపూర్వకంగా కలి శారు. అధికారిక కార్యక్రమంలో భాగంగా సౌమ్యమిశ్రా వరంగల్‌ నగరానికి చేరుకున్నా రు. ఈ సందర్భంగా ఆమెకు బొకే అందజేసి స్వాగతం పలికిన సీపీ కొంతసేపు ముచ్చటించారు. సెంట్రల్‌ జోన్‌ డీసీపీ షేక్‌ సలీమా, ఏ ఎస్పీ మనన్‌ భట్‌, ఏసీపీలు వెంట ఉన్నారు.

వరంగల్‌ నగరానికి

100 ఎలక్ట్రిక్‌ బస్సులు

వరంగల్‌ అర్బన్‌ : వరంగల్‌ మహా నగరానికి 100 ఎలక్ట్రిక్‌ బస్సులు కేటాయించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది.. నివేదిక సమర్పించాలని రాష్ట్ర మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ కమిషనర్‌ అండ్‌ డైరెక్టరేట్‌ డాక్టర్‌ టీకే.శ్రీదేవి ఆదేశించారు. సోమవారం హైదరాబాద్‌ సీడీఎంఏ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించగా, బల్దియా ప్రధాన కార్యాలయంలో కమిషనర్‌, ఆర్టీసీ వివిధ విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డైరెక్టర్‌ శ్రీదేవి మాట్లాడుతూ భారత ప్రభుత్వం ‘పీఎం ఈ–బస్‌ సేవా పథకం’లో భాగంగా వరంగల్‌ నగరానికి జనాభా ప్రాతిపదికన 100 ఎలక్ట్రిక్‌ బస్సులను నిర్వహణ కోసం బల్దియాకు అందజేయనున్నట్లు పేర్కొన్నారు. జీడబ్ల్యూఎంసీతో పాటు ఆర్టీసీ, ఎన్పీడీసీఎల్‌, హనుమకొండ వరంగల్‌ జిల్లాలకు చెందిన రవాణా శాఖ అధి కారులు సమన్వయంతో పనిచేయాలని చెప్పా రు. ప్రతిపాదనలు పంపిస్తే రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కేంద్రానికి సమర్పిస్తామని చెప్పారు. వీసీలో బల్దియా కమిషనర్‌ అశ్విని తానాజీ వాకడే, ఆర్టీసీ రీజనల్‌ మేనేజర్‌ బాలు నాయక్‌, ఎన్పీడీసీఎల్‌ ఎస్‌ఈ మధుసూదన్‌, ఎస్‌ఈ ప్రవీణ్‌చంద్ర, వరంగల్‌ ఆర్టీఓ శోభన్‌బాబు, హనుమకొండ ఆర్టీఓ వేణుగోపాల్‌, బల్దియా ఇన్‌చార్జ్‌ సిటీ ప్లానర్‌ రవీందర్‌ రాడేకర్‌, బల్దియా ఈఈ మహేందర్‌ పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement