వినతులు సత్వరమే పరిష్కరించాలి
కలెక్టర్ ప్రావీణ్య
హన్మకొండ అర్బన్ : ప్రజల నుంచి స్వీకరించిన వినతుల్లోని సమస్యలు సత్వరమే పరిష్కరించాలని అధికారులను హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆమె ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. వినతుల్లో జీడబ్ల్యూఎంసీకి 8, ఆర్‌డీఓ హనుమకొండ 7, తహసీల్దార్ హసన్‌పర్తి 5, వివిధ శాఖలకు సంబంధించి మొత్తం 70 దరఖా స్తులు వచ్చాయి. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడు తూ పెండింగ్ దరఖాస్తులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని చెప్పారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ విద్యాలత, డీఆర్డీఓ శ్రీను, అధికారులు పాల్గొన్నారు.
అర్జీలపై దృష్టి సారించాలి.. :
వరంగల్ కలెక్టర్ సత్యశారద
వరంగల్: ప్రజావాణికి వస్తున్న అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించి సత్వరమే పరిష్కరించాలని అధికారుల ను వరంగల్ కలెక్టర్ సత్యశారద ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో అర్జీదారుల నుంచి కలెక్టర్ దరఖాస్తులు స్వీకరించా రు. మొత్తం 86 దరఖాస్తులు రాగా అందులో రెవెన్యూ 33, వ్యవసాయశాఖ 7, డీఆర్‌డీఓ, జీడబ్ల్యూఎంసీ, ఎంజీఎంకు సంబంధించిన సమస్యలపై 5 చొప్పున ఉన్నాయి. కార్యక్రమంలో డీఆర్‌ఓ విజయలక్ష్మి, డీఆర్డీఓ కౌసల్యాదేవి, జెడ్పీ సీఈఓ రామిరెడ్డి, ఆర్డీఓలు సత్యపాల్‌రెడ్డి, ఉమారాణి, ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు.
వినతులు సత్వరమే పరిష్కరించాలి
Comments
Please login to add a commentAdd a comment