25నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు
హన్మకొండ కల్చరల్ : రుద్రేశ్వరస్వామి వారి వేయిస్తంభాల దేవాలయంలో ఈనెల 25 నుంచి మార్చి ఒకటో తేదీవరకు నిర్వహించనున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని వరంగల్ దేవాదాయ, ధర్మాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ రామల సునీత కోరారు. సోమవారం ఆలయంలో ప్రధానార్చకులు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో సునీత, హనుమకొండ సీఐ సతీష్ పాల్గొని ఉత్సవాల కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సునీత మాట్లాడుతూ.. రుద్రేశ్వరుడి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఆయా శాఖల సమన్వయంతో ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. సాంస్కృతిక కార్యక్రమాలు, క్యూలైన్లు, తాగునీటి సౌకర్యం, స్వామివారి కల్యాణానికి ప్రత్యేక వేదిక ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ప్రధానార్చకులు గంగు ఉపేంద్రశర్మ మాట్లాడుతూ.. ఉత్సవాల్లో భాగంగా నిర్వహించే చండీహోమంలో పాల్గొనడానికి రూ.3,116, స్వామివారి కల్యాణంలో రూ.1,116, అన్నపూజ రూ.5,116, లింగోద్భవ కాలపూజ రూ.12,116, శివరాత్రి ఉత్సవాల్లో ఐదురోజులు జరిగే పూజల్లో పాల్గొనే భక్తులు రూ.21,116 చెల్లించి రశీదు పొందాలని సూచించారు. సీఐ సతీష్ మాట్లాడుతూ ఉత్సవాల్లో మూడంచెల భద్రతను ఏర్పాటు చేస్తామని చెప్పా రు. కార్యక్రమంలో వేదపండితులు గంగు మణికంఠశర్మ, అర్చకులు సందీప్‌శర్మ, సిబ్బంది ఎల్.మధుకర్, రామకృష్ణ, రజిత తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment