శివరాత్రి వేడుకలకు ఏర్పాట్లు పూర్తిచేయాలి
కలెక్టర్ ప్రావీణ్య
హన్మకొండ అర్బన్ : జిల్లాలో ఈనెల 26న నిర్వహించే మహాశివరాత్రి ఉత్సవాలకు ఆలయాల్లో అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. వేయి స్తంభాల దేవాలయం, మడికొండ శ్రీ మెట్టు రామలింగేశ్వర స్వామి ఆలయాల్లో ఏర్పాట్లపై సంబంధిత శాఖల అధికారులతో సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమన్వయ సమావేశంలో ఆమె మాట్లాడారు. ఆలయాలను విద్యుత్ దీపాలతో అలంకరించాలని, విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని చెప్పారు. శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా జాగ్రత్త వహించాలని, మహిళా భక్తులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్నందున మహిళా పోలీస్ సిబ్బంది అధికంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులకు సూచించారు. 24 గంటల పాటు పారిశుద్ధ్య పనుల నిర్వహణ చేపట్టాలన్నారు. ఈ సందర్భంగా ఉత్సవాల పోస్టర్లను ఆవిష్కరించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి, డీఆర్‌ఓ వైవీ.గణేష్, హనుమకొండ ఆర్డీఓ రాథోడ్ రమేశ్, దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ సునీత, ఏసీపీ దేవేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment