కమిషనరేట్‌లో ఘనంగా మహిళా దినోత్సవం
వరంగల్ క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లో ప్రపంచ మహిళా దినోత్సవం శనివారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సెంట్రల్ జోన్ డీసీపీ షేక్ సలీమా కేక్ కట్ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. వివిధ విభాగాల్లో పనిచేస్తున్న మహిళా పోలీస్ అధికారులు పరిపాలనా విభాగం మహిళా అధికారులు పాల్గొని ఒకరికి ఒకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
హోలీకి ప్రత్యేక రైలు
కాజీపేట రూరల్: హోలీ పండుగను పురస్కరించుకుని చర్లపల్లి–గోరఖ్‌పూర్ మధ్య కాజీపేట జంక్షన్ మీదుగా ప్రత్యేక రైలును నడిపిస్తున్నట్లు శనివారం దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్‌ఓ ఎ.శ్రీధర్ తెలిపారు. ఈనెల 10న చర్లపల్లి–గోరఖ్‌పూర్ (07715) వెళ్లే ఎక్స్‌ప్రెస్ బుధవారం సాయత్రం 4:00 గంటలకు కాజీపేటకు చేరుకుంటుంది. 12న గోరఖ్‌పూర్–చర్లపల్లి (07716) వెళ్లే ఎక్స్‌ప్రెస్ గురువారం రాత్రి 9:00 గంటలకు చేరుతుంది. ఈఎక్స్‌ప్రెస్‌కు అప్ అండ్ డౌన్‌లో కాజీపేట, మంచిర్యాల, సిర్పూర్ కాగజ్‌నగర్, బల్లార్షా, చంద్రాపూర్, నాగపూర్, ఇటార్సీ, రాణి కమలాపథ్, బీనా, ఝాన్సీ, ఖాన్‌పూర్ సెంట్రల్, లక్నో, బరబంకి, గోండా, బాస్టీ స్టేషన్‌లో హాల్టింగ్ కల్పించినట్లు సీపీఆర్‌ఓ తెలిపారు.
అధ్యాపకుల సమస్యల
పరిష్కారానికి కృషి
విద్యారణ్యపురి: ఉపాధ్యాయ, అధ్యాపకుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని శాసన మండలిలో గొంతెత్తుతానని వరంగల్, నల్ల గొండ, ఖమ్మం జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిళి శ్రీపాల్‌రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రభుత్వ కళాశాలల గెజిటెడ్ అధ్యాపకుల సంఘం (టీజీసీజీటీఏ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ కె.సురేందర్‌రెడ్డి, ఇతర బాధ్యులు శుక్రవారం రాత్రి హనుమకొండలోని పీఆర్టీయూ భవన్‌లో శ్రీపాల్‌రెడ్డిని సన్మానించారు. ఈసందర్భంగా శ్రీపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. సీపీఎస్ రద్దుతోపాటు ఉద్యోగులు, ఉపాధ్యాయులకు రావాల్సిన ఐదు డీఏలు సాధించేలా కృషి చేస్తానన్నారు. అధ్యాపకుల సమస్యల పరిష్కారానికి పోరాడతామన్నారు. ఈసందర్భంగా అధ్యాపకుల పలు సమస్యల్ని శ్రీపాల్‌రెడ్డి దృష్టికి ఆసంఘం బాధ్యులు తీసుకెళ్లారు. కార్యక్రమంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాళ్ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజారెడ్డి, టీజీసీజీటీఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చిన్న, కేయూ కో–ఆర్డినేటర్ రామకృష్ణారెడ్డి, డి.వెంకన్న జిల్లాల బాధ్యులు, అధ్యాపకులు పాల్గొన్నారు.
అట్టహాసంగా ఇన్నోవేషన్
సమ్మిట్–25 ప్రారంభం
కాజీపేట అర్బన్: నిట్ వరంగల్‌లోని ఇన్నోవేషన్ గ్యారేజీలో శనివారం రెండు రోజుల స్టూడెంట్ ఇన్నోవేషన్ సమ్మిట్–25ను నిట్ స్టూడెంట్ వెల్ఫేర్ డీన్ శ్రీనివాసాచార్య ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నూతన ఆవిష్కరణలకు నాంది పలికేందుకు సమ్మిట్–25ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇందులో భాగంగా విద్యార్థులకు నిట్ క్యాంపస్‌లోని ‘వాస్తవ సమస్యలకు సృజనాత్మక పరిష్కారాలు’ అంశంపై పోటీలు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఇన్నోవేషన్ గ్యారేజీ హెడ్ రవికుమార్, ఫ్యాకల్టీ అడ్వైజర్ సతీశ్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
రుద్రేశ్వరాలయంలో
విదేశీ జర్నలిస్టులు
హన్మకొండ కల్చరల్: తెలంగాణలోని టూరిజం, చారిత్రక ప్రదేశాలను విశ్వవ్యాప్తం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ సూచన మేరకు శనివారం హనుమకొండలోని వేయిస్తంభాల దేవాలయాన్ని కెన్యా, శ్రీలంక, నైజీరియా, నేపాల్, టాన్జానియా దేశాలకు చెందిన జర్నలిస్టులు సందర్శించారు. ఈసందర్భంగా ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ, ఈఓ అనిల్‌కుమార్ వారిని స్వాగతించారు. రుద్రేశ్వరస్వామిని దర్శించుకున్న అనంతరం వారికి అర్చకులు స్వామివారి ప్రసాదాలు, మహదాశీర్వచనం అందించారు. జిల్లా టూరిజంశాఖ సిబ్బంది వారికి ఆలయ ప్రాశస్త్యన్ని, చరిత్రను వివరించారు. కార్యక్రమంలో జిల్లా టూరిజం అధికారి శివాజీ, దేవాలయ సిబ్బంది మధుకర్ తదితరులు పాల్గొన్నారు.
కమిషనరేట్‌లో ఘనంగా మహిళా దినోత్సవం
కమిషనరేట్‌లో ఘనంగా మహిళా దినోత్సవం
Comments
Please login to add a commentAdd a comment