చట్టాలపై అవగాహన అవసరం
పరకాల: చట్టాలపై అవగాహనతో ప్రతి ఒక్కరూ పట్టణాలు, గ్రామాల్లో శాంతియుత వాతావరణం కోసం కృషి చేయాలని పరకాల తాలుకా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, జడ్జి శాలిని లింగం కోరారు. దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా మెగా లోక్ అదాలత్‌లో భాగంగా పరకాల కోర్టులో శనివారం నిర్వహించిన లోక్ అదాలత్‌లో 481 కేసులు పరిష్కరించినట్లు తెలిపారు. బ్యాంకుల ద్వారా విధించిన జరిమానాలను రూ.1.17 లక్షలను బ్యాంకులకు చెల్లించారు. మెగా లోక్ అదాలత్‌లో జడ్జి శాలిని లింగం, రెండో తరగతి మెజిస్ట్రేట్ కొప్పుల శంకర్ 196 క్రిమినల్, సివిల్, బ్యాంకు కేసులను పరిష్కరించి ఆయా కేసులను కొట్టేశారు. కార్యక్రమంలో పరకాల బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పెండెల భద్రయ్య, ఏజీపీ లక్కం శంకర్, లోక్ అదాలత్ సభ్యులు ఓంటేరు రాజమౌళి, వెంకటరమణ, రవికుమార్, ఏపీపీలు కుమార్, రుధిర, ఏసీపీ సతీశ్‌బాబు, పరకాల సీఐ క్రాంతికుమార్‌తో పాటు పరకాల కోర్టు పరిధి వివిధ మండలాలకు చెందిన ఎస్‌ఐలు, న్యాయవాదులు, కక్షిదారులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.
పరకాల న్యాయసేవాధికార సంస్థ చైర్మన్, జడ్జి శాలిని లింగం
మెగా లోక్ అదాలత్‌లో 481 కేసుల పరిష్కారం
Comments
Please login to add a commentAdd a comment