పీఈటీల సంఘం జిల్లా కార్యవర్గం ఎన్నిక
వరంగల్ స్పోర్ట్స్/విద్యారణ్యపురి: వ్యాయామ విద్య ఉపాధ్యాయుల (పీఈటీ) సంఘం హనుమకొండ జిల్లా నూతన కార్యవర్గ ఎన్నికలు శనివారం హనుమకొండ లష్కర్ బజార్‌లోని ప్రభుత్వ ప్రాక్టీసింగ్ ఉన్నత పాఠశాల ఆవరణలో జరిగాయి. ఏకగ్రీవంగా జరిగిన ఎన్నికలకు పరిశీలకులుగా ఎ.ప్రవీణ్, పి.శ్రీనివాస్, ఎం.వెంకటేశ్వర్లు, రఘువీర్‌లు వ్యవహరించారు. రెండేళ్ల పాటు కొనసాగే ఈకమిటీ జిల్లా అధ్యక్షుడిగా ఎర్రబెల్లి ప్రభాకర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా దరిగె కుమారస్వామి, కోశాధికారిగా ఎన్.శ్రీధర్, గౌరవ అధ్యక్షుడిగా ఎం.దేవేందర్ ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు తెలిపారు. ఉపాధ్యక్షురాలిగా పావని, సంయుక్త కార్యదర్శులుగా రేబిక, కవిత, సహాయ కార్యదర్శులుగా జి.కిషన్, మైసయ్య, కార్యవర్గ సభ్యులుగా కిరణ్, ఎం.కుమార్, ఎస్.అనిత, లక్ష్మీనారాయణ, ధనలక్ష్మి, తరంగిణి ఎన్నికై నట్లు తెలిపారు. జిల్లాలో పనిచేస్తున్న వ్యాయామ ఉపాధ్యాయినులను సత్కరించారు.
Comments
Please login to add a commentAdd a comment